ఏపీ క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు…!

Chandrababu Naidu Patted For Launching Yuva Nestam Scheme

అమరావతిలో నిన్న జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి-యువనేస్తం పథకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 14 నుంచి ఆన్ లైన్లో యువనేస్తం రిజిస్ట్రేషన్ల ప్రారంభానికి ఆమోదం తెలిపింది. నిరుద్యోగ బృతితో పాటు ఏపీ కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణలో కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చిన అంశం కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చింది.
ఏపీ కేబినెట్ నిర్ణయాలు :

cm-youva-nestham

అక్టోబర్ 2 నుంచి ముఖ్యమంత్రి యువనేస్తం అమలు.
అన్ని మున్సిపాలిటీల్లో బీపీఎస్‌ అమలు.
పబ్లిక్ హెల్త్ వర్కర్స్‌కు 151 జీవో ప్రకారం వేతనాలు చెల్లించడానికి నిర్ణయం.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం చెల్లింపు.
ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ ఇచ్చేందుకు నిర్ణయం.
ఆర్య వైశ్యుల కార్పొరేషన్‌ ఏర్పాటుతో పాటు అభివృద్ధికి రూ. 30 కోట్లు కేటాయించాలని నిర్ణయం.
బిల్డింగ్ ప్లీనైజ్డ్ స్కీమ్‌ అమలుకు కేబినెట్‌ ఆమోద ముద్ర.
విజయవాడ లబ్బీపేట బృందావన్ కాలనీలో మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠ నిర్మాణానికి 1052.86 చదరపు గజాల మున్సిపల్ భూమిని నామమాత్రపు ధరకు కేటాయించేందుకు నిర్ణయం.

youva-nestham
కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో నవజాత శిశువుల విభాగం మంజూరు చేసే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోద ముద్ర.
రాజధాని ప్రాంతంలో భూములు లేని కుటుంబాలకు ఇస్తున్న పెన్షన్లను ప్రతి మూడేళ్లకొకసారి 10% పెంచాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం.