‘శైలజా రెడ్డి అల్లుడు’ ప్రివ్యూ

Sailaja Reddy Alludu Movie Preview

నాగచైతన్య, అను ఎమాన్యూల్‌ జంటగా రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. భారీ అంచనాలున్న ఈ చిత్రం రేపు వినాయక చవితి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ ఎత్తున అంచనాలున్న ఈసినిమాకు అన్ని ఏరియాల్లో మంచి బిజినెస్‌ య్యింది. ఈ చిత్రం నాగచైతన్య కెరీర్‌లోనే అతి పెద్ద సక్సెస్‌ను దక్కించుకోబోతుంది అంటూ అక్కినేని ఫ్యాన్స్‌ నమ్ముతున్నారు. మారుతి గత చిత్రాల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని చూస్తే ఖచ్చితంగా 25 కోట్ల షేర్‌ను క్రాస్‌ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. రమ్యకృష్ణ ఈ చిత్రంకు అదనపు ఆకర్షణగా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.

 

 

తల్లి కూతుర్లుగా నటించిన రమ్యకృష్ణ మరియు అను ఎమాన్యూల్‌ల మద్య సాగే సరదా సన్నివేశాలు మరియు సెటిమెంట్‌ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా ఉంటాయని, పృథ్వీ కామెడీ మరియు వెన్నెల కిషోర్‌ కామెడీ సినిమా స్థాయిని పెంచే విధంగా ఉంటాయని సినీ వర్గాల వారు అంటున్నారు. వీరిద్దరి కామెడీ ట్రైలర్‌లోనే తేలిపోయింది. ఖఛ్చితంగా సినిమా పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని పాటు మరియు ట్రైలర్‌ను చూస్తుంటే అనిపిస్తుంది. నాగచైతన్య అందుకే ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నాడు. ఆగస్టు 31న విడుదల కావాల్సిన ఈచిత్రం కేరళలో వరదల కారణంగా ఆలస్యం అయ్యింది. ఆలస్యం అవ్వడం వల్ల సమంత యూటర్న్‌కు పోటీగా నిలిచింది. యూటర్న్‌ పోటీని తట్టుకుని ఈ చిత్రం ప్రేక్షకుల నుండి పాజిటివ్‌ టాక్‌ను ఈ చిత్రం దక్కించుకుంటుందా చూడాలి. మరి కొన్ని గంటల్లో సినిమా రివ్యూతో మీ ముందుకు వస్తాం.