‘యూటర్న్‌’ ప్రివ్యూ

uturn Movie Preview

కన్నడంలో సూపర్‌ హిట్‌ అయిన ‘యూటర్న్‌’ చిత్రంను సమంత రీమేక్‌ చేయాలనుకుంటుంది అంటూ రెండు సంవత్సరాలుగా మీడియాలో వార్తలు వచ్చాయి. సమంత కోరుకున్నట్లుగానే ఆ చిత్రంను రీమేక్‌ చేసింది. ఎంతో ఇష్టపడి యూటర్న్‌ చిత్రంను చేసిన సమంత సినిమా కోసం చాలా కష్టపడ్డట్లుగా సినిమా ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది. ఈ సినిమాతో నటిగా మంచి గుర్తింపు దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో కొత్త లుక్‌ను ట్రై చేయడంతో పాటు, సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకుంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రంను చేసినట్లుగా మొదటి నుండి సమంత చెప్పుకొచ్చింది. విభిన్నమైన కథాంశంతో మొదటి నుండి చివరి వరకు సినిమా ఆధ్యంతం ఆసక్తికరంగా సాగే అంశాతో ఈ చిత్రం సాగుతుందని సమంత చెబుతూ వస్తుంది.

U turn

‘యూటర్న్‌’ చిత్రంను తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకేసారి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. వినాయక చవితి సందర్బంగా విడుదల కాబోతున్న ఈ చిత్రంతో సమంత నటిగా మంచి మార్కులు పొందడం ఖాయం అంటున్నారు. ఇక ఈ చిత్రంకు నిర్మాణ భాగస్వామిగా సమంత వ్యవహరిస్తుందని కొందరు అంటున్నారు. ఇక సినిమా విడుదలకు ముందే నిర్మాతలకు 5 కోట్ల మేరకు లాభాలను తెచ్చి పెట్టింది. మరి ఈ చిత్రం విడుదల తర్వాత ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటుంది అనేది రేపు సినిమా విడుదలైన తర్వాత రివ్యూలో చూద్దాం. ఇక ఈ చిత్రం విడుదల నేపథ్యంలో సినీ వర్గాల్లో రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. కన్నడ చిత్రాలు తెలుగులో ఆకట్టుకోవనే సెంటిమెంట్‌ ఉంది. మరి ఆ సెంటిమెంట్‌ను సమంత బ్రేక్‌ చేస్తుందా అనే విషయాన్ని కూడా రేపు చూద్దాం.