వ్యాపారంలో అడుగు పెట్టబోతుంది

tamannaah decide her own jewellery shop

తమన్నా గత కొంత కాలంగా సినిమాల్లో అవకాశాల కోసం నానా పాట్లు పడుతుంది. వచ్చిన అవకాశాలు సక్సెస్‌ కాకపోవడంతో పాటు, చేసిన సినిమాలు నిరాశ మిగుల్చుతున్న కారణంగా మెల్ల మెల్లగా సినిమా పరిశ్రమకు దూరం అవ్వాలనే ఉద్దేశ్యంతో తమన్నా ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. సినిమా నుండి తప్పుకున్న తర్వాత వ్యాపారంలో సెటిల్‌ అవ్వాలనే ఉద్దేశ్యంతో తమన్నా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. అందుకు ఏర్పాట్లు కూడా తమన్నా చేసుకుంటుందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. తమన్నా గత కొంత కాలంగా ఏదైనా వ్యాపారం చేయాలనే పట్టుదలతో ఉంది. తాజాగా వ్యాపార విషయంలో ఒక క్లారిటీకి వచ్చినట్లుగా తెలుస్తోంది.

tamanna

తనకు అనుభవం ఉన్న జ్యూవెలరీ వ్యాపారంలో ఈమె అడుగు పెట్టాలని నిర్ణయించుకుంది. వినాయక చవితి సందర్బంగా జ్యూవెలరీ వ్యాపారం నిర్వహించేందుకు సిద్దం అయ్యింది. తన పేరు మీద రేపు ఒక జ్యూవెలరీ బ్రాండ్‌ను ఆమె విడుదల చేయబోతుంది. తాను విడుదల చేయబోతున్న జ్యూవెలరీ బ్రాండ్‌ను తన తల్లిదండ్రులకు బహుమానంగా తమన్నా ప్రకటించింది. హీరోయిన్‌గా తనకు దక్కిన గుర్తింపుతో వ్యాపార రంగంలో అడుగు పెట్టబోతున్న తమన్నా తన బ్రాండ్‌ జ్యూవెలరీ దేశ వ్యాప్తంగా మంచి సక్సెస్‌ అవ్వాలని ఆమె కోరుకుంటుంది. హీరోయిన్‌గా కొనసాగుతూనే వ్యాపారం చేయాలని భావిస్తున్న తమన్నా సినిమాల్లో ఆఫర్‌లు రాని సమయంలో పూర్తి స్థాయి వ్యాపారవేత్తగా మారనున్నట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు.