సూపర్ క్లాసీ లుక్ లో ఎన్టీఆర్…ఆడియో డేట్ కూడా ఫిక్స్…ఇక పండగే !

aravinda sametha movie poster

డైలాగ్ డెలివరీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతున్న కొత్త చిత్రం “అరవింద సమేత వీర రాఘవ”. ఇటీవల విడుదలయిన చిత్ర టీజర్ చూస్తుంటే రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏమేర సంచలనాలు సృస్టించబోతోందో అర్ధం అవుతుంది. అసలే ఇప్పటికి పవన్ చివరి చిత్రం అజ్ఞాతవాసి రిజల్ట్ తో డీలా పడ్డ త్రివిక్రమ్ ఈ సారి మాత్రం ఎట్టి పరిస్థుల్లోని హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నట్టు ఉన్నాడు. దీంతో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా సినిమా ఎప్పుడు చూసేద్దామా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

తాజాగా అభిమానులకు మరో ఇంట్రస్టింగ్ న్యూస్ తో ముందుకొచ్చింది చిత్రయూనిట్. వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌ల‌తో ఈ రోజు సాయంత్రం 5.40 నిమిషాలకి టీం నుండి ఓ స‌ర్‌ప్రైజ్ రానుంద‌ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ ఈరోజు త‌మ ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది. అయితే ఆ సర్ ప్రైజ్ ఏంటబ్బా అని బుర్రలు వాచిపోయేలా అభిమానులు ఆలోచనలో పడ్డారు. కొందరు ట్రైలర్ అనుకుంటుంటే మరికొందరు ఆడియో రిలీజ్ డేట్ అని ఇలా ఎవరికి తోచినట్టు వాళ్లు ఊహించుకుంటున్నారు. కానీ ఆ సర్ ప్రైజ్ ఏంటో తెలిసిపోయింది.సరిగ్గా 5.40 నిమిషాలకు అరవింద సమేత యూనిట్ ఎన్టీఆర్ మరో పోస్టర్ ను రిలీజ్ చేసింది. గతంలో ఎన్టీఆర్ కత్తి పట్టుకొని మాస్ లుక్ లో ఉన్న పోస్టర్ ను విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ను మంచి క్లాసీ లుక్ లో చూపించాడు త్రివిక్రమ్. అంటే ఈ దెబ్బకు క్లాస్ – మాస్ కలగలిపిన ప్యాక్డ్ ఎంటర్ టైనర్ అందించనున్నట్టు త్రివిక్రమ్ హింట్ ఇచ్చినట్టేగా. అలాగే ఈ చిత్ర ఆడియో డేట్ కూడా ప్రకటించింది హారికా హాసినీ సంస్థ. ఈ నెల ఇరవైన ఆడియో ఆల్బం విడుదల చేయనున్నామని చెప్పింది. అలాగే ఆ ఫంక్షన్ కు అతిధులు ఎవరు అనేది మాత్రం సస్పెన్స్ లో ఉంచేసింది.