‘యూటర్న్‌’ రివ్యూ & రేటింగ్ – తెలుగు బుల్లెట్

u-turn-review

నటీ నటులు : సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక చావ్లా
కథ-దర్శకత్వం: పవన్ కుమార్
నిర్మాతలు: శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు
సంగీతం : పూర్ణచంద్ర తేజస్వి
సినిమాటోగ్రఫీ : నికేత్ బొమ్మి
ఎడిటర్ : సురేష్ అరుముగమ్

Negative Statements In UTurn Movie

తెలుగు చలన చిత్ర రంగం మూస ధోరణి నుంచి బయటపడి కొత్త తరహా ప్రయత్నాలు చేయడమే కాదు విజయాలు కూడా సాధిస్తున్న ఈ తరుణంలో వచ్చిన యూ టర్న్ కూడా చాలా మందిలో ఆసక్తి రేకెత్తించింది. ఇందుకు దర్శకుడు పవన్ కుమార్ ఓ కారణం అయితే నూతన ఆలోచనలకు పెద్ద పీట వేస్తున్న సమంత ఈ సినిమాలో నటించడం ఇంకో కారణం. ఈ ఇద్దరితో పాటు ప్రామిసింగ్ సినిమాలు చేస్తున్న ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ కూడా ఇందులో నటించడంతో యూ టర్న్ మీద అంచనాలు పెరిగాయి. సినిమా అందుకు తగ్గట్టు వుందో, లేదో చూద్దామా !

కథ…

uturn-movie-samantha

రచన (సమంత ) స్వతంత్ర భావాలున్న అమ్మాయి. ఓ పత్రికలో రిపోర్టర్. తల్లిదండ్రులు పెళ్లి పెళ్లి అని పోరుతున్నా పట్టించుకోకుండా ఏదో చేయాలి అనుకుంటుంది. ఆఫీస్ లో తనతో పాటు పనిచేస్తున్న ఆదిత్య అంటే ఇష్టపడుతుంది. అయితే అతనితో పరిచయం కాస్త ముందుకు వెళ్ళింది అనుకున్నరోజే ఆత్మస్థైర్యం ఆమె అనూహ్యంగా ఓ హత్య కేసులో ఇరుక్కుంటుంది. ఆ కేసు నుంచి ఆమె బయటపడేందుకు పోలీస్ అధికారి నాయక్ సహాయపడతారు. అయితే విచారణలో భాగంగా ఆ మరణంతో పాటు అంతకుముందు జరిగిన పది చావులకు ఆర్కే పురం ఫ్లై ఓవర్ మీద ఓ యూ టర్న్ కి సంబంధం ఉందని తేలుతుంది. ఆ క్రమంలో ఆ యూ టర్న్ ముప్పు రచనకి కూడా వస్తుంది. దాని నుంచి బయటపడే క్రమంలో ఇంకా సమస్యలు ఎదురు అవుతాయి. చివరకు ఆమె ఈ సమస్యల నుంచి బయటపడిందా, యూ టర్న్ ప్రాణాలని ఎందుకు బలిగొంటున్నది అన్నదే మిగిలిన కధ.

విశ్లేషణ….

uturn movie release

ఓ థ్రిల్లర్ తరహా కధనిఎంచుకున్నప్పుడు ప్రేక్షకుడిని ఆ మూడ్ లోకి తీసుకెళ్లడం చాలా ముఖ్యం. దర్శకుడు పవన్ కుమార్ ఆ పని తొలి పది నిమిషాల్లోనే విజయవంతంగా చేయగలిగాడు. ఇక అక్కడ నుంచి కధలో మున్ముందు ఏమి జరుగుతుంది అన్న ఆలోచన తప్ప ప్రేక్షకుడి మనసు ఇంకో వైపు వెళ్లకుండా చేయడంలో పవన్ స్క్రీన్ ప్లే గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఓ చిన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న కధ అయినప్పటికీ కధనంలో ఎక్కడా బిగువు తప్పదు. Eeచివరి దాకా ఇదే టెంపో మైంటైన్ అయ్యింది. ప్రేక్షకుల ఆలోచనావిధానంలో వస్తున్న మార్పుకి తగ్గట్టు సమాజం నిర్లక్ష్యం చేస్తున్న ఓ చిన్న అంశం చుట్టూ కధ అల్లుకోవడంలోనే దర్శకుడు లాఘవం ప్రదర్శించాడు. అయితే సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఇంకా బాగా చేయవచ్చేమో అనిపిస్తుంది. కధకి కీలకమైన మలుపులు వచ్చేటప్పుడు టెంపో కొనసాగించడం మీద ఇంకాస్త దృష్టి పెడితే బాగుండేది. ఓ థ్రిల్లర్ కధ, కధనంలో సామాజిక సందేశం ఇచ్చిన పవన్ ని మెచ్చుకోవాల్సిందే.


ఇక ఈ సినిమాకి సమంత నటన ప్రాణం పోసింది. సినిమా ఆసాంతం కనిపించే ఆమె ప్రతి సీన్ లో తన ప్రత్యేకత చాటింది. డబ్బింగ్ విషయంలోనూ ఆమె వాచకం బాగా మెరుగుపడింది. సినిమాలో రచన తప్ప సమంత కనిపించలేదు. ఇక ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ కూడా తమ పరిధి మేరకు బాగా చేశారు. భూమిక క్యారెక్టర్ స్పెషల్ సర్ఫరైస్.సాంకేతిక నిపుణుల పనితీరు సినిమాకు తగ్గట్టు వుంది. ముఖ్యంగా కెమెరా, సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్స్. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఇంకా బాగా తీసి వుండాల్సింది.

తెలుగు బులెట్ పంచ్ లైన్ :  ”యూ టర్న్ “ తప్పుగా తీసుకుంటే కర్మ అనుభవించాల్సిందే.
తెలుగు బులెట్ రేటింగ్ : 3 /5 .