బాబుకి అరెస్ట్ వారెంట్….శాపం కాదు వరమే…!

Sivaji About Operation Garuda On Chandrababu

ఆంధ్రప్రదేశ్‌పై పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని, మరో నాలుగైదు రోజుల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు నోటీసులు అందబోతున్నాయంటూ ఇటీవల సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమయ్యాయి. ఆయన చెప్పినట్టే చంద్రబాబుకు వ్యతిరేకంగా ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో అందరి దృష్టీ ఇప్పుడు మళ్లీ శివాజీ మాటల మీదకి మళ్లింది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎనిమిదేళ్ల నాటి బాబ్లీ కేసులో చంద్రబాబుకు నోటీసులు జారీ కావడం పెను దుమారమే రేపుతోంది. చంద్రబాబుపై పెట్టిన కేసును మహారాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ఉపసంహరించుకుందన్న వార్తలొచ్చాయి. అయితే, ఇప్పుడు అనూహ్యంగా మళ్లీ ఈ కేసు తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. చంద్రబాబుపై పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని, ఆయనను సీఎం పదవి నుంచి దించేందుకు బీజేపీ నేతలు కుట్ర చేస్తున్నారంటూ ఇటీవల శివాజీ మీడియా సమావేశంలో ఆరోపించారు. చంద్రబాబును తొలి నుంచీ ఇబ్బంది పెడుతున్న కేంద్రం అందు కోసం ‘ఆపరేషన్ గరుడ’ను అమలు చేస్తోందని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా నాలుగైదు రోజుల్లో చంద్రబాబుకు నోటీసులు అందబోతున్నాయంటూ సంచలన విషయాన్ని వెల్లడించారు. అయితే, ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆయన వ్యాఖ్యలను కొట్టిపడేశారు. ఇప్పుడు చంద్రబాబుకు నోటీసులు రావడంతో శివాజీ వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. 2010నాటి బాబ్లీ కేసు ఇప్పుడు తెర పైకి వచ్చింది. ఈ కేసులో భాగంగా మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నుంచి ఏపీ సీఎం చంద్రబాబుకు నోటీసులు జారీ అయ్యాయి. 2010నాటి ఈ కేసులో బాబుతో సహా 16మందికి నోటీసులు పంపగా అందరికీ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ కూడా వచ్చింది. ఈ నెల 21న ధర్మాబాద్ కోర్టుకు హాజరు కావాలని వారికి నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులు జారీ చేసినవారిలో తెలంగాణ, ఏపీకి చెందిన నేతలు ఉన్నారు. వీరిలో కొందరు నేతలు ఇప్పుడు అధికార పార్టీ సహా వేరే పార్టీల్లో కూడా ఉన్నారు. నోటీసులు అందిన వారిలో నారా చంద్రబాబు నాయుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు, టి .ప్రకాష్ గౌడ్, నక్కా ఆనంద బాబు, జి.కమలాకర్, కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, సి.హెచ్. ప్రభాకర్, ఎన్.నాగేశ్వర్, జి.రామానాయుడు, సి.హెచ్.విజయరామారావు, ముజఫరుద్దీన్ అన్వరుద్దీన్, హన్మంత్ షిండే, పి.అబ్దుల్ ఖాన్ రసూల్ ఖాన్, ఎస్. సోమోజు, ఏఎస్.రత్నం, పి.సత్యనారాయణ శింభులు ఉన్నారట.

cm-and-sivaji
2010లో మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు, దానికి అనుబంధంగా ఉన్న ఎత్తపోతల పథకాలకు వ్యతిరేకంగా చంద్రబాబుతో పాటూ అప్పటి టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ప్రాజెక్టు పరిశీలించేందుకు వెళ్లగా.. సరిహద్దులో మహారాష్ట్రలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నేతలు అక్కడే రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. తర్వాత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో లాఠీఛార్జ్ చేశారు. చంద్రబాబుతో సహా చంద్రబాబు సహా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్న ఓ కాలేజీలో ఉంచారు. తర్వాత బలవంతంగా విమానంలో హైదరాబాద్‌కు పంపారు. ఈ ఘటన తర్వాత విధి నిర్వహరణలో ఉన్న పోలీసులను అడ్డుకోవడం, అనుమతి లేకుండా వచ్చారని .. 144సెక్షన్ అమలులో ఉన్నా పట్టించుకోలేదంటూ చంద్రబాబుతో పాటూ ఎమ్మెల్యేలపై ధర్మాబాద్‌లో కేసు నమోదయ్యింది. ఈ కేసుపై ధర్మాబాద్‌ కోర్టులో ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ పిటిషన్‌పై విచారణ జరగ్గా వారెంట్‌ను ఎందుకు అమలు చేయలేదని కోర్టు పోలీసుల్ని ప్రశ్నించిందట. దీనిపై మహారాష్ట్ర పత్రికల్లో కథనాలు వచ్చాయి. రెండు మూడు రోజుల్లో నోటీసులు వస్తాయని ప్రచారం జరగ్గా గురువారం నాడే నోటీసులు జారీ అయ్యాయి. అయితే త్వరలో తెలంగాణా ఎన్నికలు రానున్న నేపధ్యంలో ఈ కేసు కేసీఆర్ కు కాక చంద్రబాబుకే ప్లస్ అవనుంది. ఎందుకంటే బాబ్లి ప్రాజక్టు కు వ్యతిరేకంగా, తెలంగాణ కోసం చంద్రబాబు పోరాటం చేసిన విషయాన్ని ఈ వారంట్ ఇపుడు తెలంగాణ ప్రజలకు గుర్తు చేసింది. ఇది చంద్రబాబును ఇబ్బంది పెట్టేది కాక పోగా ఈ వారెంట్ ఆయనను తెలంగాణలో హీరోని చేసే అవకాశం ఉంది. దీనిని తెలంగాణలో ప్రచారానికి ఆయుధంగా వాడుకుంటామని చెబుతున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఏ పార్టీనయితే ఆంధ్రా పార్టీ అని బ్రాండే వేసి తరిమేయాలనుకుంటున్నాడో ఆ పార్టీ నేత తెలంగాణ కోసం అరెస్టయినట్లు ఇపుడు ఎన్నికల ముందు ఈ నాన్ బెయిలబుల్ వారంట్ గుర్తు చేసింది.నిజానికి 2010లో బాబ్లి గురించి మాట్లాడని నాయకుడు కెసిఆరే. ఆ విధంగా చంద్రబాబును కార్నర్ చేయడానికి ప్రయత్నించిన బీజేపీ ఆయన్ను మరో సారి తెలుగు ప్రజల ముందు హీరోను చేసి నిలబెట్టింది.

cm-chandrarbabu-naidu