బండ్ల గణేష్ సంచలన నిర్ణయం…జనసేనను కాదని-రాహుల్ సేనలోకి…!

Bandla Ganesh To Join Congress
టాలీవుడ్ నటుడు, స్టార్ నిర్మాత అవతారమెత్తిన బండ్ల గణేశ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ కు వీరభక్తుడిగా తనకు తను ప్రకటించుకున్న గణేష్, జనసేనలో చేరతాడు అని అందరూ భావిస్తున్న తరుణంలో ఈరోజు  ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయిపోయాడు.
bandla-ganesh
ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో నేడు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సమక్షంలో గణేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. ఆయనతోపాటు నియోజకవర్గానికి చెందిన మరికొందరు కూడా పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. ఆయన రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ టికెట్‌పై షాద్ నగర్ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.
bandla-ganesh-join
గణేశ్ చేరికతో షాద్ నగర్‌లో కాంగ్రెస్ మరింత బలపడుతుందని, ఆయన సినీ గ్లామర్ ఉపయోగపడుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. పవన్ జనసేనలో ఆయన చేరతాడని భావించినా ఆ పార్టీ తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేయమని ప్రకటించడం, పోనీ ఏపీలో అయినా పోటీ చేస్తుందా అంటే అది కూడా ఆశ్చర్యార్ధకమే కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీయేతర పార్టీలతో పొత్తులపై రాహుల్ గాంధీతో చర్చించేందుకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు నేతలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. వారు కూడా గణేష్ చేరిక కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది.
bandla-ganesh-pawan-kalyan