సిల్లీ ఫెలోస్ టీజర్: శ్రీశైలానికి కాదు కైలాసానికే!

Silly Fellows Motion Teaserచాలా గ్యాప్ తీసుకున్న అల్లరి నరేష్ మళ్ళీ ఫాం లోకి వచ్చాడు. కానీ ఈ సారి సింగిల్ గా కాకుండా నటుడు సునీల్‌తో కలిసి ‘సిల్లీఫెలోస్’ అనే కామెడీ ఎంటర్‌టైనర్‌తో డబుల్ ఢమాకా ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ గురువారం విడుదల చేసింది. ఇందులో నరేష్ బైక్ నడుపుతుంటే, ఆ స్పీడుకు సునీల్ గాల్లో వేలాడుతున్నాడు. ఈ సందర్భంగా నరేష్.. ‘‘ఈ స్పీడులో వెళ్తే.. గంటలో శ్రీశైలం వెళ్లిపోతాం కదరా’’ అని సునీల్‌తో అంటే.. ‘‘గంటెందుకురా.. అరగంటలోనే వెళ్లిపోతాం, కైలాసానికి’’ అని సునీల్ చెప్పడం ఈ సినిమా ప్రేక్షకులకి నవ్వుల విందు అనే విషయం అర్ధం అవుతోంది. భీమినేని శ్రీనివాస రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద టీజర్ అంచనాలను పెంచేస్తోంది. బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూర్ణ, చిత్ర శుక్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలశ్యం ఈ మోషన్ టీజర్ మీరు ఒక లుక్ వేసెయ్యండి మరి.