‘అరవింద సమేత’ మొదలు కానుంది..!

ntr aravinda sametha Veera Raghava movie

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న ‘అరవింద సమేత’ చిత్రం చివరి దశ చిత్రీకరణ జరుపుకుంటుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంకు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. రికార్డు స్థాయిలో అంచనాలున్న ఈ చిత్రం టీజర్‌ను ఇటీవలే విడుదల చేయడం జరిగింది. ఇక టీజర్‌ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రంను త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్నాడు. భారీ స్థాయిలో ఈ చిత్రంను ప్రమోట్‌ చేయాలని త్రివిక్రమ్‌ భావిస్తున్నాడు. ఎంతగా ప్రమోట్‌ చేస్తే అంతగా ఓపెనింగ్స్‌ వస్తాయి అంటూ ఇటీవల విడుదల చేసిన చిత్రాలు నిరూపించాయి. అందుకే త్రివిక్రమ్‌ నెల రోజుల ముందు నుండే ప్రమోషన్స్‌లో జోరును పెంచబోతున్నాడు.

 aravinda sametha

వచ్చే నెల వినాయక చవితి నుండి ప్రమోషన్స్‌ను మొదలు పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. వినాయక చవితి సందర్బంగా ఎన్టీఆర్‌కు సంబంధించిన ఇంకో లుక్‌ను రివీల్‌ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ వెంటనే ఒక పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పాట విడుదలైన వారం రోజుల్లోనే ట్రైలర్‌ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. సినిమా విడుదల వరకు ప్రేక్షకుల్లో సినిమా గురించి చర్చ జరిగేలా త్రివిక్రమ్‌ ప్రణాళిక సిద్దం చేస్తున్నాడు.

 aravinda sametha

సినిమా ప్రమోషన్‌ కోసం అయిదుగురితో ఒక టీంను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీం సినిమా ప్రమోషన్స్‌కు సంబంధించిన విషయాల్లో ప్రక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లబోతున్నారు. అరవింద సమేత చిత్రంను దసరా కానుకగా అక్టోబర్‌లో విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. ఎన్టీఆర్‌కు ఈ చిత్రం సరి కొత్త రికార్డును కట్టబెడుతుందనే నమ్మకంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు.

aravinda sametha