సోషల్‌ మీడియాలో ‘స్పైడర్‌’కు వ్యతిరేక ప్రచారం

Satires On Mahesh Babu Spyder Look In Social Media

Posted August 12, 2017 at 13:47 

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హీరోగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా తమిళ స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్పైడర్‌’ చిత్రం కోసం ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులకు గత ఆరు నెలలుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాను దాదాపు సంవత్సరంకు పైగా దర్శకుడు మురుగదాస్‌ తెరకెక్కించడం జరిగింది. దానికి తోడు ఈ సినిమాను దాదాపు 125 కోట్లతో నిర్మించడం జరిగింది. సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో ఈ సినిమా దాదాపుగా 200 కోట్ల బిజినెస్‌ చేయడం జరిగింది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయడం జరిగింది.

టీజర్‌ సోషల్‌ మీడియాలో కోటి వ్యూస్‌ను సొంతం చేసుకుని కొత్త రికార్డులను సృష్టించింది. ఇక్కడ వరకు బాగానే ఉంది కాని, ఇప్పుడు సోషల్‌ మీడియాలో కొత్త ప్రచారం మొదలైంది. సినిమాపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ‘స్పైడర్‌’ చిత్రంలో మహేష్‌బాబు, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తప్ప తెలుగు నటీ నటులు ఒక్కరు కూడా ఉన్నట్లుగా కనిపించడం లేదు. టీజర్‌లో చాలా మంది నటీనటులు కనిపించారు. కాని అంతా కూడా తమిళ మొహాలే ఉన్నాయి. విన్‌ ఎస్‌జే సూర్య నుండి హీరోయిన్‌ తల్లి మరియు హీరో అన్న పాత్రలు కూడా తమిళ నటీనటులతోనే చేయించినట్లుగా అనిపిస్తుంది అంటూ యాంటీ మహేష్‌బాబు ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ ప్రచారం సినిమాకు మైనస్‌ అవుతుందని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

మరిన్ని వార్తలు:

SHARE