మలయాళి దోషితో బాలయ్య

Balakrishna To Romance With Malayalam Actress Natasha Doshi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నందమూరి బాలయ్య వరుసగా సినిమాలు చేస్తూ యువ హీరోలకు పోటీగా నిలుస్తున్నాడు. సంక్రాంతికి తన 100వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య గత వారం పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పైసా వసూల్‌’ చిత్రాన్ని తీసుకు వచ్చాడు. భారీ స్థాయిలో అంచనాలున్న ఆ సినిమా ప్రేక్షకుల నుండి పాజిటివ్‌ టాక్‌ను దక్కించుకుంది. ఆ సినిమా అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్స్‌ను రాబడుతుంది. ఇక బాలయ్య 102వ సినిమా సందడి ప్రారంభం అయ్యింది. తమిళ దర్శకుడు కె ఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో బాలయ్య ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్‌ చేయబోతున్నాడు. ఇప్పటికే ఒక హీరోయిన్‌గా నయనతారను ఎంపిక చేయడం, ఆమెతో షూటింగ్‌ కూడా చేస్తూ ఉండటం ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. బాలయ్య, నయన్‌ కాంబోకు మంచి పేరుంది. ఇద్దరిది సక్సెస్‌ కాంబో అవ్వడం వల్ల ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇక ముగ్గురు ముద్దుగుమ్మల్లో రెండవ హీరోయిన్‌ను తాజాగా ఎంపిక చేశారు. మలయాళి ముద్దుగుమ్మ నటాషా దోషిని హీరోయిన్‌గా ఎంపిక చేస్తున్నట్లుగా ప్రకటించారు. కొత్త హీరోయిన్‌తో బాలయ్య రొమాన్స్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.

మలయాళంలో ఈ అమ్మడు పలు సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులో ఈమెకు ఏ స్థాయిలో గుర్తింపు దక్కుతుందో చూడాలంటూ బాలయ్య 102వ సినిమా రావాల్సిందే. త్వరలోనే మూడవ ముద్దుగుమ్మను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ సినిమాను సి కళ్యాణ్‌ నిర్మిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని నిర్మాత భావిస్తున్నాడు.

మరిన్ని వార్తలు:

అర్జున్ రెడ్డి 3 గంట‌ల 40 నిమిషాలు?

చైతూ, అల్లరిల్లో ఎవరిది పై చేయి?