21 కేజీల ల‌డ్డూ ధ‌ర రూ.15.60 లక్ష‌లు

Balapur Ganesh Laddu Auctioned Today for Record Breaking Price of 15.60 lakh taken

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఎప్ప‌టిలానే బాలాపూర్ ల‌డ్డూ ఈ సారి కూడా రికార్డు స్థాయి ధ‌ర ప‌లికింది. రూ. 15.60 ల‌క్ష‌ల‌కు నాగం తిరుప‌తి రెడ్డి అనే వ్య‌క్తి లడ్డూను ద‌క్కించుకున్నారు. 21 మంది వేలంలో పాల్గొన‌గా.హైద‌రాబాద్ జూబ్లిహిల్స్ లోని అయ్య‌ప్ప‌సొసైటీకి చెందిన తిరుప‌తిరెడ్డి ల‌డ్డూ చేజిక్కించుకున్నారు. గ‌త ఏడాది క‌న్నా ల‌డ్డూ ధ‌ర రూ. 95 వేలు ఎక్కువ ప‌లికింది. పోయిన సంవ‌త్స‌రం స్థానికేత‌రుడు స్కైల్యాబ్ రెడ్డి రూ. 14.65ల‌క్ష‌ల‌కు ల‌డ్డూ ద‌క్కించుకున్నారు. బాలాపూర్ లడ్డూకు ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఖైర‌తాబాద్ వినాయ‌కుడు ఎంత ఫేమ‌స్సో, బాలాపూర్ లడ్డూ అంత ఫేమ‌స్‌. ఈ ల‌డ్డూను ద‌క్కించుకుంటే సిరిసంప‌ద‌లు క‌లుగుతాయ‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. 1994లో రూ. 450ల‌తో లడ్డూ వేలంపాట మొద‌ల‌యింది. ఏటికేడు ఊహించని రీతిలో లడ్డూ ధ‌ర పెరుగుతోంది. లడ్డూను ద‌క్కించుకునేందుకు భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో పోటీప‌డ‌టంతో ఏటా రికార్డు ధ‌ర ప‌లుకుతోంది. వేలంపాట‌లో 21 కేజీల లడ్డూను పొంద‌టంపై తిరుప‌తి రెడ్డి ఆనందం వ్య‌క్తంచేశారు. జీవితంలో ఒక్క‌సారైనా ల‌డ్డూను ద‌క్కించుకోవాల‌న్న క‌ల నెర‌వేరింద‌ని ఆయ‌న అన్నారు. త‌న‌కు స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు:

కోదండం మాస్టారు పార్టీ పెడతారా..?

ముందస్తుపై మోడీని నమ్మని చంద్రులు

మిస్ ఇండియా ద‌క్షిణాఫ్రికాగా తెలుగు యువ‌తి