మిస్ ఇండియా ద‌క్షిణాఫ్రికాగా తెలుగు యువ‌తి

ap-woman-wins-miss-india-south-africa-title

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మిస్ ఇండియా సౌతాఫ్రికా టైటిల్ ను తెలుగు యువ‌తి అద్దేప‌ల్లి శ్రీశుభ గెలుచుకుంది. 25 ఏళ్ల శ్రీ శుభ‌ద‌క్షిణాఫ్రికాలోని ఓ బ్యాంక్ లో ఏడాదిన్న‌ర నుంచి ఐటీ ఎన‌లిస్ట్ గా ప‌నిచేస్తోంది. చివ‌రి సెగ్మెంట్ లో ఎనిమిది మంది అమ్మాయిల‌తో పోటీప‌డిన శ్రీశుభ త‌న డ్యాన్స్ తో జ‌డ్జిల‌ను క‌ట్టిప‌డేసింది.
త‌న జీవితంలోని వివిధ ద‌శ‌ల‌ను ప్ర‌తిబింబిస్తూ మూడునిమిషాల పాటు చేసినడ్యాన్స్ ఫైన‌ల్లో ఆమెను విజేత‌గా నిలిపింది. డ్యాన్స్ అంటే త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని శ్రీశుభ చెప్పింది. స్నేహితులు చాలెంజ్ చేయ‌టంతో పోటీలో పాల్గొన్నాన‌ని తెలిపింది. 2009లో దక్షిణాఫ్రికా పీజెంట్ గా నిలిచిన ఆయుషి ఛాబ్రా త‌రువాత భార‌త్ లో పుట్టి ఈ టైటిల్ గెలుచుకున్న రెండో యువ‌తి శ్రీశుభే అని ఫ‌రూఖ్ ఖాన్ తెలిపాడు.