వైసీపీ జెండా పీకేయబోతున్నారా ?

Ys Jagan YSRCP merge into BJP

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
నిన్నమొన్నటిదాకా 2019 ఎన్నికల్లో గెలిచి సీఎం అవుతానంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పుకునేవారు. అదే పాయింట్ మీద ఆయన ప్రతి సభ జరుగుతుండేది. ఇక పార్టీ శ్రేణుల్ని కాపాడేందుకు కూడా ఆయన దగ్గర వున్న ఆయుధం అదే. అయితే నంద్యాల, కాకినాడ ఎన్నికలతో ఆ డైలాగ్ అవుట్ డేటెడ్ అయిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన అదే డైలాగ్ కొట్టినా పెద్ద కామెడీ అయిపోతుంది. ఈ పరిస్థితుల్లో జగన్ కి కనిపిస్తున్న ఒకే ఒక్క దారి …వైసీపీ జెండా పీకేయడం. ఈ మాట వినగానే వైసీపీ, జగన్ అభిమానులకి కడుపు మండిపోవచ్చు. కానీ జగన్ అండ్ కో మాత్రం సీరియస్ గా వైసీపీ జెండా పీకే ఆలోచన చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

గాసిప్ లా అనిపిస్తున్న ఈ విషయానికి ప్రాతిపదిక ఇటీవల బీజేపీ హైకమాండ్ కి వైసీపీ నుంచి వెళ్లిన ఓ ప్రతిపాదన. తమతో పొత్తు పెట్టుకుంటే మెజారిటీ సీట్లు ఇస్తామన్నప్పటికీ కమలనాధులు కరుణించకపోవడంతో జగన్ బెంబేలెత్తిపోయారట. అందుకే బీజేపీ లో వైసీపీ ని విలీనం చేస్తే అయినా సీఎం పదవి హామీ, కేసుల నుంచి విముక్తి కలుగుతుందని జగన్ ఆశపడ్డారట. అదే విషయాన్ని ఓ రాయబారి ద్వారా బీజేపీ హైకమాండ్ దగ్గరికి తీసుకెళితే కూడా కమలనాధులు కనికరించడం లేదట. సీఎం పదవి, కేసుల విషయం పరిశీలిస్తాం అన్న హామీ మాత్రమే రావడంతో జగన్ పరేషాన్ అవుతున్నారట. అయినా సరే బీజేపీ లో విలీనం అయితేనే ఏదో రకంగా ఈ కష్టం నుంచి బయటపడొచ్చని జగన్ సన్నిహితుడు విజయసాయి రెడ్డి భావిస్తున్నారట. ఆయన సలహా జగన్ పాటిస్తే వైసీపీ జెండా పీకేసినట్టే.

మరిన్ని వార్తలు:

21 కేజీల ల‌డ్డూ ధ‌ర రూ.15.60 లక్ష‌లు

క‌మ‌ల్ హాస‌న్ తో న‌గ్మా భేటీ

ఆపరేషన్ వికర్ష్