విష్ణు బాబు కొత్త అవతారంకు సిద్దం

Manchu Vishnu Intrested in Directing Movies
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్‌లో హీరోలు నిర్మాతలుగా మారడం సర్వ సాధారణం. ప్రస్తుతం తెలుగులో ఉన్న పలువురు హీరోలు ఒక వైపు హీరోగా నటిస్తూనే నిర్మాతగా సినిమాలు నిర్మిస్తున్నారు. మంచు హీరో విష్ణు హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా బ్యాక్‌ టు బ్యాక్‌ చిత్రాలు చేస్తున్న విషయం తెల్సిందే. వరుసగా మంచు విష్ణు చిత్రాలు నిర్మిస్తూ రెగ్యులర్‌ నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు. మంచు విష్ణు హీరోగానే కాకుండా తన సినిమాలకు తానే స్టంట్స్‌ కంపోజ్‌ చేస్తూ ఉంటాడు. ఇక కథ మరియు స్క్రిప్ట్‌ చర్చల్లో కూడా పాల్గొని మంచు విష్ణు తన అభిప్రాయాలు తెలియజేస్తూ ఉంటాడు.

ఆమద్య సంపూర్నేష్‌బాబుతో మంచు విష్ణు నిర్మించిన ‘సింగం 123’ చిత్రం గుర్తింది కదా, ఆ సినిమాకు స్వయంగా మంచు విష్ణు కథను అందించిన విషయం తెల్సిందే. స్క్రీన్‌ప్లే రచనలో మంచి ప్రావిణ్యం ఉన్న మంచు విష్ణు త్వరలో దర్శకత్వం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మంచు వారి వారసులు అంతా కూడా మల్టీ ట్యాలెంటెడ్‌ అనే టాక్‌ ఇప్పటికే ఉంది. ఆ విషయాన్ని నిజం చేస్తూ మంచు హీరో విష్ణు దర్శకత్వంలో కూడా తన సత్తా చాటబోతున్నాడు. తాజాగా ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రాన్ని చేసిన మంచు విష్ణు త్వరలో ఆ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఆ తర్వాత సొంత దర్శకత్వంలో మంచు విష్ణు చిత్రం ఉంటుందని సమాచారం అందుతుంది.