మంచు వారి ఇంట వారసుడు

manchu vishnu welcomes baby boy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మంచు వారి ఇంట మరో వారసుడు జన్మించాడు. మంచు మోహన్‌బాబు పెద్ద కొడుకు మంచు విష్ణు, వెరోనికాలకు కొత్త సంవత్సరంలో బాబు జన్మించాడు. జనవరి 1న హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ హాస్పిటల్‌లో వెరోనికా బాబుకు జన్మనిచ్చింది. ఇటీవలే మంచు విష్ణు తనకు బాబు అయినా లేదా పాప అయినా పర్వాలేదు అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. తనకు ఇప్పటికే ఇద్దరు అమ్మాయిల రూపంలో వారసులు ఉన్నారు అంటూ చెప్పుకొచ్చిన మంచు విష్ణుకు బాబు పుట్టడం అందరికి ఆశ్చర్యంను కలిగిస్తుంది. బాబు పుట్టడంతో మంచు వారి ఇంట సంతోషంకు అవదు లేకుండా ఉంది.

మంచు లక్ష్మికి ఇప్పటికే ఒక కూతురు ఉండగా, మంచు విష్ణుకు ముగ్గురు పిల్లలు అయ్యారు. ఇక మంచు మనోజ్‌ క్యూలో ఉన్నాడు. మంచు మనోజ్‌ పెళ్లి అయ్యి కూడా సంవత్సరాలు గడుస్తుంది. అయితే కొన్ని కారణాల వల్ల ప్రస్తుతానికి ఆయన పిల్లలను వద్దనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే మంచు మనోజ్‌ కూడా తండ్రి అవ్వాలని మంచు వారి అభిమానులు కోరుకుంటున్నారు. మంచు విష్ణుకు బాబు పుట్టిన సందర్బంగా ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాం.