మన్మథుడు 2 ముహూర్తం అదేనట

nagarjuna registers manmadhudu 2
నాగార్జున కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో ‘మన్మథుడు’ ముందు వరుసలో కనిపిస్తుంది. నాగార్జున క్రేజ్ ను మరింతగా పెంచిన ఈ సినిమాకి సీక్వెల్ గా ‘మన్మథుడు 2’ రూపొందనుంది. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని నాగ్ అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేసి, అదే రోజు నుంచి రెగ్యులర్ షూటింగు జరపనున్నారట. తొలి షెడ్యూల్ 10 నుంచి 15 రోజుల పాటు జరగనున్నట్టుగా చెబుతున్నారు. 2020 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఇక కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో త్వరలో ‘బంగార్రాజు’ ప్రాజెక్టును కూడా నాగ్ పట్టాలెక్కించనున్నారు. తన సొంత బ్యానర్ పై రెండు సినిమాలను దాదాపు ఒకేసారి నాగ్ నిర్మిస్తుండటం విశేషం.