స్నానం చేస్తుండగా వీడియో…కోరిక తీర్చాలని వేధింపులు

sexual

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో ఓ ఆకతాయి రెచ్చిపోయి వివాహిత స్నానం చేస్తుండగా వీడియోలు, ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. తన కోరిక తీర్చాలని వేధించడం మొదలుపెట్టాడు. దీనికి ఆ యువకుడిని దండించి దారిలో పెట్టాల్సిన యువకుడి కుటుంబ సభ్యులు కూడా సహకరించారు. బయటకు చెబితే పరువు పోతుందన్న భయంతో వివాహిత ఈ విషయాన్ని భర్తకు కూడా చెప్పలేదు. నిజానికి శ్రీకాకుళం జిల్లాకు చెందిన దంపతులు 10 సంవత్సరాల క్రితం గుంటూరుకు చేరుకుని పనిచేసుకుంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో వివాహిత స్నానం చేస్తుండగా, ఓ యువకుడు ఫోన్ లో రహస్యంగా వీడియోలు, ఫొటోలు తీశాడు. అనంతరం తన కోరిక తీర్చాలనీ, లేదంటే ఈ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగాడు. నాలుగు రోజుల క్రితం సదరు యువకుడు మరోసారి వేధిస్తుండగా భర్త ఇంటికి రావడంతో విషయం బయటపడింది. ఈ వేధింపులతో మనస్తాపానికి లోనైన వివాహిత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే గుంటూరు జీజీహెచ్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ ఏఎస్పీని బాధితురాలి భర్త, బంధువులు ఆశ్రయించారు.