వినాయక్ హీరోగా దిల్ రాజు మూవీ ?

Dil-Raju-New-movies

డైరెక్ట‌ర్ వినాయ‌క్ ఎంతో మంది స్టార్ హీరోల‌కు హిట్లు ఇచ్చారు. కానీ ఒక‌ప్పుడు వినాయ‌క్‌తో సినిమాలు తీసేందుకు క్యూలో ఉన్న స్టార్ హీరోలు ఇప్పుడు ఆయ‌న క‌థ చెపుతాన‌న్నా వినే ప‌రిస్థితుల్లో లేరు. ఇంటిలిజెంట్ సినిమా త‌ర్వాత వినాయ‌క్‌కు బాల‌య్య ఓ ఛాన్స్ ఇస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చినా అది కూడా ఎందుకో గాని ప‌ట్టాలు ఎక్క‌లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు వినాయ‌క్ హీరోగా మారుతున్నారట ? విన‌డానికి కాస్త షాకింగ్‌గా ఉన్నా ఇది నిజ‌మే అని అత్యంత విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల సమాచారం. వినాయ‌క్ వ‌య‌స్సు, ఫిజిక్‌కు త‌గిన పాత్ర‌లో ఓ స్క్రిఫ్ట్ ని ఒక నూతన దర్శకుడు రెడీ చేయడంతో ఈ సినిమా త్వరలో పట్టాలెక్కడం ఖాయం అని అంటున్నారు. డైరెక్ట‌ర్ శంక‌ర్ అసిస్టెంట్ న‌ర‌సింహ‌రావు అనే ఆయన చెప్పిన స్క్రిఫ్ట్ నిర్మాత దిల్ రాజుకు పిచ్చ‌పిచ్చ‌గా న‌చ్చేసింద‌ట‌. వెంట‌నే రాజు ఈ స్క్రిఫ్ట్ నెరేష‌న్‌ను వినాయ‌క్‌కు చెప్పించ‌డం, విన‌య్ ఓకే చెప్ప‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయ‌ట‌. ఈ రోజు, రేప‌ట్లో ఈ సినిమాపై ఎనౌన్స్‌మెంట్ కూడా ఉంటుందంటున్నారు. తిరుప‌తిలో మ‌హ‌ర్షి టీంతో ఉన్న దిల్ రాజు అక్క‌డే ప్ర‌క‌ట‌న చేస్తారని అంటున్నారు. డిస్ట్రిబ్యూట‌ర్‌గా ఉన్న దిల్ రాజు విన‌య్ డైరెక్ష‌న్‌లో నితిన్ హీరోగా వ‌చ్చిన దిల్ సినిమాతో నిర్మాత‌గా మారారు. అప్ప‌టి వ‌ర‌కు వెంకట రమణారెడ్డి కాస్తా దిల్ రాజుగా మారిపోయాడు. ఈ సినిమా ద‌ర్శ‌కుడు వినాయ‌క్‌ నే ఇప్పుడు హీరోగా పెట్టి దిల్ రాజు నిర్మాత‌గా సినిమా చేస్తున్నాడు.