హెల్మెట్ లో తల…బ్యాగ్ లో బాడీ పార్ట్శ్…మహిళ అనుమానాస్పద మృతి

murder

కర్ణాటకలోని మంగళూరులో జరిగిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఖాద్రీ పార్క్ సమీపంలోని ఓ పండ్ల దుకాణం దగ్గర అనుమానాస్పదంగా పడి ఉన్న ఓ బ్యాగును తెరిచి చూడగా అందులో మహిళ దేహం ముక్కలు ముక్కలుగా ఉండటం కలకలం సృష్టించింది. పోలీసులు కధనం ప్రకారం ఎప్పటిలాగే పండ్ల దుకాణం తెరిచేందుకు వెళ్లిన షాపు యజమాని ఆ బ్యాగ్‌ను చూశారు. బ్యాగులో ఏముందో తెలుసుకోవడం కోసం దాన్ని తెరిచాడు. ఊహించని విధంగా ఆ బ్యాగులో మహిళ అవయవాలు ఉండటంతో అతడు ఒక్కసారిగా భయపడి కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు అక్కడికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. బ్యాగుతో పాటు అక్కడ ఓ హెల్మెట్ ఉండటం అందులో మహిళ తల ఉండటాన్ని గమనించిన పోలీసులు బ్యాగులోని అవయవాలు కూడా మహిళవే అనే నిర్ధారణకు వచ్చి కేసు దర్యాప్తు మొదలుపెట్టారు. పోలీసుల విచారణలో హత్యకు గురైన మహిళ పండేశ్వర్ ప్రంతంలో ఓ ఎలక్ట్రికల్ షాపును నడుపుతున్న ఆమెదిగా గుర్తించారు. భర్తతో గొడవపడిన ఆమె కొంతకాలంగా భర్త నుంచి దూరంగా ఉంటోంది. ఈ హత్యలో అతడి హస్తం ఏమైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. అయితే ఓ మొబైల్ దొంగతనం కేసులో కొద్దిరోజులుగా అతడు జైలులో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు… కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని నిర్ణయించుకున్నారు.