చైతు, సామ్ మధ్య ఇగో ప్రాబ్లెమ్?

Maruti ready to story for naga chaitanya samantha movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఈ తరంలో ప్రేమకి ప్రతిరూపంలా బాగా పరిణితితో వ్యవహరిస్తున్న నాగచైతన్య, సమంత మధ్య కూడా ఇగో ప్రాబ్లెమ్ వస్తుందా ? ఈ నెల 6 , 7 తేదీల్లో హిందూ, క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఒక్కటి కాబోతున్న ఆ ఇద్దరి మధ్య డైరెక్టర్ మారుతి సమస్యలు సృష్టించడానికి ట్రై చేస్తున్నసాడట. పైగా సితార ఎంటర్ టైన్ మెంట్ సంస్థ కూడా ఈ గూడు పుఠాణిలో భాగం కాబోతుందని అనుకుంటున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏమిటంటారా ? . మీరు అనుకున్నదే… ఇది రియల్ మ్యాటర్ కాదు. ఓన్లీ రీల్ మేటర్.

సితార సంస్థ దర్శకుడు మారుతితో చైతు హీరోగా ఓ సినిమా చేయాలి అనుకుంటోంది. ఈ సినిమా సబ్జెక్టు పెళ్లి తర్వాత ఆలుమగల మధ్య వచ్చే ఇగో సమస్య అట. ఇంతకుముందు చైతు హీరోగా పెళ్ళికి ముందు అంటే ప్రేమికుల మధ్య వచ్చే ఇగో ప్రాబ్లెమ్ తో తీసిన 100 % లవ్ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ఇగో పెళ్లి తర్వాత వస్తే ఏంటి అన్న సబ్జెక్టు మీద వర్క్ చేస్తున్న మారుతి ఈ సినిమాకి సమంత హీరోయిన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారట. ఆమె ఓకే చెబితే పెళ్లి అయిన వెంటనే ఆ ఇద్దరి మధ్య ఇగో ప్రాబ్లెమ్ సృష్టించడానికి మారుతీ రెడీ గా వున్నట్టే.