మెగా లేడీస్ మేకప్ ఛాలెంజ్ వీడియో వైరల్..

కరోనా దెబ్బకు ఎవరూ కూడా బయటకు రానీ పరిస్థితి. దీంతో సెలబ్రిటీలు వారి వారి స్టైల్లో తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. ముఖ్యంగా మగవారైతే ఇల్లు ఊడుస్తూ.. వంటలు చేస్తూ రకరకాల విన్యాసాలు చేస్తుంటే ఆడవారు మాత్రం వారికి అత్యంత ఇష్టమైన వాటిపై వీడియోలు చేసుకుంటూ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. మొన్న సంప్రదాయ ఛాలెంజెస్ అని మెగా కుటుంబం మహిళామణులంతా కలిసి చీరలు కట్టి.. పోటీలు దిగారు. ఆ తర్వాత భార్యాభర్తల ఛాలెంజెస్ అని భర్తలతో ఫోటోలు దిగారు. టీషక్ట్ ఛాలెంజెస్ అని మరోరోజు మెగా ఫ్యామిలీ లేడీస్ అంతా వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ లాక్ డౌన్ కాలాన్ని అలా గడిపేస్తున్నారు. అయితే తాజాగా మెగా కుటుంబం లేడీస్ అంతా కలిసి మేకప్ ఛాలెంజెస్ విసురుకున్నారు.

ముఖ్యంగా సినీరంగానికి చెందిన హీరోయిన్లు ఇపుడు మేకప్ ఛాలెంజ్ ఒకటి స్టార్ట్ చేసారు. ఇప్పుడిది ఓ చాలెంజ్ గా అన్ని ఇండస్ట్రీస్‌లో పాపులర్ అయింది. తాజాగా మెగా ఫ్యామిలీకి చెందిన లేడీస్ మేకప్ చాలెంజ్‌లో పార్టిసిపేట్ చేసారు. ముందుగా చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఈ మేకప్ చాలెంజ్ ప్రారంభించింది. ఆ తర్వాత నిహారిక, చిరు చిన్న కూతురు శ్రీజతో పాటు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డితో పాటు మిగిలిన మెగా ఫ్యామిలీకి చెందిన ఆడవాళ్లు ఇందులో పాల్గొన్నారు. వీళ్లంతా కలిసి చేసిన ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.