వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం… ఫీజులపై బడులకు ఆదేశాలు

ప్రపంచమంతా కరోనా వైరస్ కాలం నడుస్తోంది. ప్రజలు ఏ ఒక్కరూ కూడా ఇంట్లో నుంచి బయటకు కదలలేని పరిస్థతి. అయితే ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అదేమంటే.. ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పేద తల్లిదండ్రులు ముఖ్యంగా ప్రైవేటు స్కూల్స్, కాలేజీ లకు సంబంధించి విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయకూడదని ఆదేశించింది.

అదేవిధంగా ఈ ఏడాది ప్రైవేటు స్కూళ్లలో గత ఏడాది ఫిక్స్ చేసిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలని చెప్తోంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. ఇందుకు సంబంధించి ప్రైవేటు కాలేజీలకు, స్కూల్స్ కు ఆదేశాలు జారీ చేసింది. అడ్మిషన్స్ లో కేవలం ఒక త్రైమాసిక ఫీజు మాత్రమే తీసుకోవాలని సూచించింది. మొదటి త్రైమాసిక ఫీజులు రెండు విడతలుగా కట్టించుకోవాలని, రెండు విడతలకు కనీసం 45 రోజుల వ్యవధి ఉండాలని ఏపీ పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అలాగే…

ఈ కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ వల్ల ఎలాంటి ఆదాయ మార్గం లేకపోవడంతో ఆదాయం మొత్తం కూడా కోల్పోతున్న పరిస్థితి నెలకొనడంతో ప్రతి ఒక్కళ్ళు ఇంటికే పరిమితం కావడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పడు వచ్చే విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొన్నది. దీంతో విద్యా సంవత్సర ప్రారంభంపై కూడా కరోనా ప్రభావం చూపే అవకాశముంది కాబట్టి ప్రభుత్వం ముందస్తుగా కేవలం గత విద్యా సంవత్సరానికి సంబంధించి ఏదైతే నిర్దేశించిన ఫీజు ఉంటుందో అది మాత్రమే తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.