“హను మాన్” లో మెగాస్టార్? డైరెక్టర్ కామెంట్స్ వైరల్ !

“హను మాన్” లో మెగాస్టార్? డైరెక్టర్ కామెంట్స్ వైరల్ !
Cinema News

రానున్న సంక్రాంతి బరిలో మంచి అంచనాలు నెలకొల్పుకున్నా సాలిడ్ సినిమా ల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన భారీ మూవీ “హను మాన్” కూడా ఒకటి. మరి పాన్ ఇండియా లెవెల్లో టీజర్ తోనే హైప్ ని తెచ్చుకున్న ఈ సినిమా రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ తో కూడా ఇంప్రెస్ చేసింది.

మరి ఈ ట్రైలర్ లో ఒక రేంజ్ లో అనిపించిన అంశాల్లో అయితే ఎండింగ్ లో వచ్చిన హను మాన్” విజువల్స్ కూడా ఒకటి. మరి ఇందులో చూపించిన కళ్ళు చూస్తే వెంటనే అందరికీ ఒక్కసారిగా గుర్తుకొచ్చిన పేరు మెగాస్టార్ చిరంజీవి. చాలా మంది ఆ పాత్ర చేస్తుంది చిరంజీవి అనే ఫిక్స్ అయ్యిపోయారు.

అయితే అసలు ఈ క్రేజీ అంశంపై దర్శకుడు ప్రశాంత్ వర్మ మరింత ఆసక్తి రేపాడు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ పాత్ర చేస్తుంది చిరంజీవి గారా కాదా అనేది మాత్రం ఇప్పుడు నేను చెప్పను అని కానీ ఆ పాత్రలో చిరంజీవి గారు అద్భుతంగా ఉంటారు అనేది
మాత్రం నిజం. అయినప్పటికీ మా సినిమాలో ఆ పాత్ర చేసింది ఎవరు అనేది ఇప్పుడు సినిమా రిలీజ్ వరకు నేను చెప్పదలుచుకోలేదు.

దానిని సస్పెన్స్ గానే ఉంచాలి అనుకుంటున్నాను అని స్పష్టం చేసాడు. దీనితో తన మాటల్లో ఆ పాత్ర చేసింది మెగాస్టార్ అనే అని కొంతమేర చాలా మందికి మరింత బలంగా అనిపించింది. మరి ఈ పవర్ ఫుల్ పాత్రలో ఎవరు కనిపిస్తారు అనేది తెలియాలి అంటే ఈ జనవరి 12 వరకు ఆగి చూడాల్సిందే.