మెహబూబాకు పాజిటివ్‌ సెన్సార్‌ టాక్‌

Mehbooba movie censor report

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మెహబూబా’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈ వారంలో విడుదల కాబోతున్న మెహబూబాకు సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. పూరి జగన్నాధ్‌ తనయుడు ఆకాష్‌ పూరి ఈ చిత్రంతో పూర్తి స్థాయి హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ మరియు ట్రైలర్‌, పాటలు సినిమా స్థాయిని పెంచే విధంగా ఉన్నాయి. ఈ చిత్రంపై చాలా నమ్మకం పెట్టుకుని భారీ బడ్జెట్‌తో పూరి స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు.

తాజాగా సెన్సార్‌ బోర్డు ముందుకు వెళ్లిన ఈ చిత్రంకు మంచి స్పందన దక్కింది. సెన్సార్‌ బోర్డు సభ్యులు ఈ సినిమాకు యూ/ఎ సర్టిఫికెట్‌ను ఇవ్వడం జరిగింది. ఒక మంచి సబ్జెక్ట్‌తో దర్శకుడు పూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని సెన్సార్‌ బోర్డు సభ్యులు అభినందనలు తెలియజేసినట్లుగా సమాచారం అందుతుంది. దర్శకుడు పూరి ఈ చిత్రం కోసం తన ఇల్లును సైతం అమ్మేసి నిర్మించాడు. ఈ కథపై ఆయనకు చాలా నమ్మకం ఉందని, అందుకే అంత భారీగా ఖర్చు చేసిన మరీ చేశాడు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఆకాష్‌ అద్బుతమైన నటనతో ఆకట్టుకున్నాడు అంటూ సమాచారం అందుతుంది. తప్పకుండా ఈ చిత్రం ఆకాష్‌కు మంచి క్రేజ్‌ను తీసుకు వస్తుందనే నమ్మకంను సెన్సార్‌ బోర్డు సభ్యులు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.