పవన్‌ ఫ్యాన్స్‌ 11 వేల మందేనా?

Ram Gopal Varma Satire On Pawan And His Fans

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సోషల్‌ మీడియాలో మెగా ఫ్యాన్స్‌ చాలా యాక్టివ్‌గా ఉంటారు. ముఖ్యంగా పవన్‌ను ఎవరైనా విమర్శిస్తే వారికి సోషల్‌ మీడియాలో చుక్కలు చూపించడం చాలా కామన్‌గా మనం చూస్తేనే ఉంటాం. సోషల్‌ మీడియాలో రామ్‌ గోపాల్‌ వర్మపై గతంలో పలు సార్లు మెగా ఫ్యాన్స్‌ తీవ్ర స్థాయిలో పగ తీర్చుకున్న విషయం తెల్సిందే. తాజాగా మరోసారి రామ్‌ గోపాల్‌ వర్మపై తమదైన శైలిలో మెగా ఫ్యాన్స్‌ పగ తీర్చుకున్నారు. అయితే అన్నింటికి తనకు అనుకూలంగా మల్చుకుని, పబ్లిసిటీ చేసుకునే వర్మ తాజాగా మరోసారి మెగా ఫ్యాన్స్‌కు షాక్‌ ఇచ్చి తన ఆఫీసర్‌ సినిమాను ప్రమోట్‌ చేసుకున్నాడు.

రామ్‌ గోపాల్‌ వర్మ తాజాగా నాగార్జునతో ‘ఆఫీసర్‌’ అనే చిత్రాన్ని చేసిన విషయం తెల్సిందే. ఆ చిత్రంను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా తాను ఈ చిత్రంను తెరకెక్కించినట్లుగా వర్మ చెబుతూ వస్తున్నాడు. తాజాగా రామ్‌ గోపాల్‌ వర్మ ‘ఆఫీసర్‌’ చిత్రం టీజర్స్‌ను విడుదల చేయడం జరిగింది. ఈ టీజర్‌కు భారీ ఎత్తున డిస్‌లైక్స్‌ వస్తున్నాయి.

ఒక టీజర్‌కు ఈస్థాయిలో డిస్‌లైక్స్‌ రావడంతో అది ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్‌ వల్లే అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఆఫీసర్‌ టీజర్‌కు 11 వే డిస్‌లైక్స్‌ రావడంపై వర్మ స్పందిస్తూ, పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ సంఖ్య కేవలం 11 వేలేనా? ఆయనకు అభిమానులు లక్షల్లో ఉంటారని అనుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఏం చేసినా కూడా విచిత్రంగా, వింతగా ఉంటుంది. తాజాగా ఈ వ్యాఖ్యలు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.