‘మహానటి’ ప్రివ్యూ

mahanati Movie Telugu Bullet preview

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు ప్రేక్షకులు దాదాపు రెండు సంవత్సరాలుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘మహానటి’. తెలుగు సినిమా చరిత్రలో నిలిచి పోయే సావిత్రి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెల్సిందే. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్‌ నటించగా ముఖ్య పాత్రలో సమంత నటించింది. ఈ చిత్రంలో ఇంకా దుల్కర్‌ సల్మాన్‌, విజయ్‌ దేవరకొండ, మోహన్‌బాబు, క్రిష్‌, షాలిని పాండే ఇంకా ప్రముఖ నటీనటులు నటించిన విషయం తెల్సిందే. దాంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మహానటిపై అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు.

‘మహానటి’ చిత్రం స్క్రిప్ట్‌ వర్క్‌ను దాదాపు మూడు సంవత్సరాల పాటు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ చేయడం జరిగింది. సావిత్రిపై అభిమానంతో ఆమె జీవిత చరిత్ర సినిమాను తెరకెక్కించాలని భావించిన ఆయన చాలా రీసెర్స్‌ చేసి, అన్ని విషయాలను తెలుసుకుని ఆ తర్వాత రంగంలోకి దిగాడు. నటీనటుల ఎంపిక విషయంలో కూడా నాగ్‌ అశ్విన్‌ ఎంతటి ఆలోచన ప్రదర్శించాడో తాజాగా విడుదలైన పోస్టర్స్‌ మరియు టీజర్‌లను బట్టి అర్థం అవుతుంది. ఏ ఒక్క పాత్రను కూడా లైట్‌ తీసుకోకుండా అన్ని పాత్రలకు కూడా తగ్గ నటీనటులను ఎంపిక చేయడంతో నాగ్‌ అశ్విన్‌ మొదటి సక్సెస్‌ దక్కించుకున్నాడు. ఇక రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మహానటి ఆ మిగిలిన సక్సెస్‌ను దక్కించుకుంటుందేమో చూడాలి.