నాగ్‌ అశ్విన్‌ మోసం చేశాడట!

sanjay kishore comments on nag ashwin

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

‘మహానటి’ చిత్రం కలెక్షన్స్‌ వర్షం కురిపిస్తుంది. నిర్మాతలకు లాభాలతో పాటు భారీ ఎత్తున పేరును కూడా తీసుకు వస్తుంది. పుష్కరానికి రెండు మూడు సినిమాలు మాత్రమే ఇలాంటివి వస్తాయి. అందులో మహానటి స్థానం దక్కించుకుంది. సావిత్రి జీవిత చరిత్రను కళ్లకు కట్టినట్లుగా చూపించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. ఆటోబయోగ్రఫీలు అంటే డాక్యుమెంటరీ టైప్‌ కాకుండా ఆకట్టుకునే విధంగా, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించి మెప్పించాడు. ఇందుకోసం నాగ్‌ అశ్విన్‌ ఎంతో మందిని కలిశాడు, సావిత్రిగారి గురించి తెలుసుకునేందుకు ఎన్నో బుక్స్‌ చదివాడు. అందులో భాగంగానే సావిత్రికి వీరాభిమాని అయిన సంజయ్‌ కిషోర్‌ను కూడా పలు సందర్బాల్లో కలుసుకుని, ఆయన నుండి వివరాలు సేకరించాడట. ఆ విషయంపై తాజాగా సంజయ్‌ కిషోర్‌ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

సంజయ్‌ కిషోర్‌ మీడియాతో మాట్లాడుతూ.. సావిత్రమ్మ జీవితం గురించి సినిమా తీస్తాను అంటే చాలా సంతోషంగా అనిపించింది. అందుకే తాను జీవితంలో సంపాదించిన ఎంతో ముఖ్యమైన సావిత్రమ్మకు సంబంధించిన సమాచారాన్ని మరియు ఆమె వస్తువులను, ఇంకా పలు విషయాలను నాగ్‌ అశ్విన్‌కు చెప్పాను. ఆయన టీంతో కలిసి నన్ను కలుసుకున్నప్పుడు ఆయనకు కావాల్సిన సమాచారంను ఇచ్చాను. ఇంత చేసిన నాకు కనీసం కృతజ్ఞతలు చెబుతూ టైటిల్‌ కార్డు వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను ఆర్థికంగా ఏమీ ఆశించలేదని, కనీసం కృతజ్ఞతలు అంటూ టైటిల్‌ కార్డు వేస్తే ఆను సంతోషించేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు. సావిత్రమ్మ జీవితాన్ని వెండి తెరపై చూస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉందని, నాకు అన్యాయం చేసినా కూడా చిత్రానికి మాత్రం దర్శకుడు న్యాయం చేశాడు అంటూ నాగ్‌ అశ్విన్‌పై సంజయ్‌ కిషోర్‌ ప్రశంసలు కురిపించాడు. మరి ఈ విషయమై దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఎలా రియాక్ట్‌ అవుతాడో చూడాలి.