జెమిని కూతుర్లు లెక్క తేడం లేదే!

7 daughter of gemini ganesan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నాగ్‌ అశ్విన్‌ ఎప్పుడైతే సావిత్రి జీవిత చరిత్ర చిత్రం ‘మహానటి’ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడో అప్పటి నుండి జెమిని గణేషన్‌ గురించి తెలుసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. సావిత్రిని ఆరాధ్య దైవంగా భావించే వారికి సైతం జెమిని గణేషన్‌ గురించి కొద్ది మొత్తంలో కూడా తెలియదు. కాని మహానటిలో జెమిని గణేషన్‌ గురించి చాలా వరకు రివీల్‌ చేశారు. కాని ఇంకా మరికొన్ని విషయాలను కూడా ప్రేక్షకులు తెలుసుకోవాలని నెట్‌లో సెర్చ్‌ చేస్తున్నారు. భారీ ఎత్తున జెమిని గణేషన్‌ గురించి తెలుసుకోవాలని సెర్స్‌ చేస్తున్న వారికి ఎక్కువగా ఈ ఫొటో కనిపిస్తుంది. ఈ ఏడుగురు జెమిని గణేషన్‌ కూతుర్లు అంటూ ప్రచారం జరుగుతుంది.

జెమిని గణేషన్‌కు మూడు పెళ్లిల్లు అయ్యాయి. సావిత్రి మూడవ భార్య అనే విషయం అందరికి తెల్సిందే. సినిమాలో రెండు పెళ్లిల్లు మాత్రమే చూపించారు. ఆయన రెండవ భార్య గురించి రెండు మూడు సీన్స్‌ చిత్రీకరించారు. కాని వాటిని లెంగ్త్‌ ఎక్కువ కారణంగా తొలగించడం జరిగింది. ఇక సినిమాలో చూపించిన ప్రకారం జెమిని పెద్ద భార్యకు ఇద్దరు కుమార్తెలు, రెండవ భార్యకు ఇద్దరు కుమార్తెలు కాగా చిన్న భార్య అయిన సావిత్రికి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. అంటే జెమినికి అయిదుగురు కూతుర్లు. అయితే ఈ ఫొటోలో మాత్రం మొత్తం ఏడుగురు కనిపిస్తున్నారు. ఈ ఏడుగురిలో అదనంగా ఉన్న ఇద్దరు ఎవరి సంతానం అంటూ ప్రస్తుతం చర్చ జరుగుతుంది. జెమినికి ముగ్గురు కాకుండా నలుగురు భార్యలు ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.