నానిపై నమ్మకం ఉంది : మంచు లక్ష్మి

Manchu Lakshmi says all the best to Nani

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
స్టార్‌ మా వారు బిగ్‌బాస్‌ సీజన్‌ 2కు నానిని హోస్ట్‌గా ఎంపిక చేయబోతున్నట్లుగా మూడు నెలలుగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ మధ్య నానిని ఇదే విషయమై ప్రశ్నించగా అదేం లేదని, ఒక వేళ స్టార్‌ మా వారు ఆ ప్రస్థావన తెస్తే తప్పకుండా చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. నిప్పులేనిదే పొగ రాదు అంటారు, అప్పుడు అన్నట్లుగానే, మీడియాలో వార్తలు వచ్చినట్లుగానే బిగ్‌బాస్‌ సీజన్‌ 2కు నాని హోస్ట్‌గా వ్యవహరించబోతున్నట్లుగా స్టార్‌ మా వారు ప్రకటించారు. స్టార్‌ మాటీవీ ఒక వీడియోను విడుదల చేసి అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఎన్టీఆర్‌ రేంజ్‌లో నాని ఆకట్టుకోలేక పోవచ్చు. కాని నాని తనదైన శైలిలో ఆకట్టుకుంటాడు అనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

నానిని బిగ్‌బాస్‌ హోస్ట్‌గా ప్రకటించిన తర్వాత పలువురు సోషల్‌ మీడియాలో స్పందించారు. నాని ఎంపికపై మంచు లక్ష్మి స్పందిస్తూ… ఇదో మంచి ప్రకటన, చాలా ఆసక్తికరంగా బిగ్‌బాస్‌ సీజన్‌ 2 కోసం ఎదురు చూస్తున్నాం. ఆల్‌ది బెస్ట్‌ తప్పకుండా నాని బాగా చేస్తాడనే నమ్మకం ఉంది అంటూ మంచు లక్ష్మి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ఇంకా పలువురు కూడా నాని స్టామినాపై నమ్మకంగా ఉన్నారు. నాని తనదైన మాట శైలి మరియు తెలుగుతనంతో ఖచ్చితంగా బిగ్‌బాస్‌ను ఎంటర్‌టైన్‌ దిశలో తీసుకు వెళ్తాడు అని భావిస్తున్నారు. అయితే ప్రేక్షకులు మాత్రం ఎన్టీఆర్‌ అయతే బాగుండేది అంటూ కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఒకటి రెండు వారాల్లో నాని ఎంపిక సరైనదే అంటూ అంతా అభినందిస్తారు అని స్టార్‌ మా వారు చెబుతున్నారు.