కొత్త ఆయుధంతో ‘అరవింద సమేత వీర రాఘవ’

NTR Aravinda Sametha Veeraraghava movie First Look

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఆది, సింహాద్రిల నుండి జైలవకుశ వరకు ఆయుధం ఎత్తిన ప్రతిసారి రికార్డుల కోత కోసుకుంటూ వెళ్ళిన జూనియర్ యన్.టి.ఆర్ యుద్దానికి సన్నద్ధమైన ధీరుడిలా త్రివిక్రమ్ మార్క్ టైటిల్ తో ‘అరవింద సమేత వీర రాఘవ’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఫస్ట్ లుక్ తో వచ్చాడు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ని ఎట్టకేలకు రిలీజ్ చేశారు. ఎవరు ఊహించని విధంగా సరికొత్త టైటిల్ ను కూడా ఎనౌన్స్ చేశారు. ముందుగా అసామాన్యుడు అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పలురకాల వార్తలు వచ్చినప్పటికీ అవన్నీ వట్టి రూమర్స్ అని తేలిపోయాయి.

ఫైనల్ గా త్రివిక్రమ్ తన మార్క్ కి తగ్గటుగా ” అరవింద సమేత వీర రాఘవ” అనే టైటిల్ ను సెట్ చేశారు. సరికొత్త ఫిట్ నేస్ తో ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చాడని చెప్పాలి. ఇక మొట్టమొదటి సారిగా సిక్స్‌ ప్యాక్‌ బాడీతో ఎన్టీఆర్ ఇందులో అదరగొట్టేశాడు. ఈ లుక్ లో ఎన్టీఆర్‌ చాలా స్టైలిష్‌గా కండలవీరుడిగా కనపడుతున్నాడు. ఇటీవల జిమ్‌లో కసిగా వ్యాయామం చేస్తోన్న జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎట్టకేలకు ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సిక్స్‌ ప్యాక్‌తో కనపడుతున్నట్లు స్పష్టం అయింది.

కొత్త ఆయుధంతో 'అరవింద సమేత వీర రాఘవ' - Telugu Bullet