కాజల్‌ షాకింగ్‌ నిర్ణయం

kajal agarwal sensational decision on movies

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మగధీర చిత్రంతో తెలుగులో టాప్‌ హీరోయిన్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న కాజల్‌ సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్‌లో టాప్‌ హీరోయన్‌గా సినిమాల్లో నటించింది. కాజల్‌ స్టార్‌ హీరోలందరి సరసన నటించేసి సత్తా చాటింది. ఎంతటి హీరోయిన్స్‌ అయినా కూడా కొన్నాళ్ల తర్వాత ఫేడ్‌ ఔట్‌ అవ్వాల్సిందే. ప్రస్తుతం కాజల్‌ కూడా అదే పరిస్థితుల్లో ఉంది. చేతిలో పెద్ద సినిమాలు లేకపోవడంతో ఈమె నిర్మాతలకు ఆఫర్లు ఇవ్వడం మొదలు పెడుతుంది. ఇప్పటి వరకు స్టార్‌ హీరోలతోనే నటించాను కనుక, ఇకపై కూడా స్టార్‌ హీరోలతోనే నటిస్తాను అని తానేం మడి కట్టుకు కూర్చోలేదని, తాను అవకాశం వస్తే చిన్న హీరోలతో అయినా నటించేందుకు సిద్దం అంటూ చెప్పుకొచ్చింది.

ఇటీవలే రానాతో ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రాన్ని చేసిన కాజల్‌ ఆ తర్వాత ఎమ్మెల్యే చిత్రాన్ని చేసింది. ప్రస్తుతం శర్వానంద్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ముందు కూడా తన పాత్ర బాగుంటే చిన్న హీరోలతో సినిమాలు కంటిన్యూ చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది. సీనియర్‌ హీరోలందరితో నటించిన తాను ఇకపై నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేస్తూ, చిన్న హీరోలతో రొమాన్స్‌కు సిద్దం అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి కాజల్‌ ఇంకా కూడా ఇండస్ట్రీలో కొంత కాలం కొనసాగాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రకటన చేసింది. మరి ఈమె ప్రకటన స్వాగతించి చిన్న హీరోలు ఈమెతో నటించేందుకు ముందుకు వస్తారేమో చూడాలి