బ్రేకింగ్ : కర్నాటక సిఎంగా యడ్యూరప్ప రాజీనామా

Karnataka CM yeddyurappa resigned

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కర్ణాటక రాజకీయం అనేక మలుపులు తిరుగుతోంది. ముఖ్యమంత్రిగా మూడు రోజుల క్రితమే ప్రమాణస్వీకారం చేసిన బీఎస్ యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేశారు. బలపరీక్ష సందర్భంగా ఆయన సభను ఉద్దేశించి భావోద్వేగంగా మాట్లాడిన ఆయన రైతుల ఇక్కట్లు, సాదకబాధకాలు తాను స్వయంగా వీక్షించానని, వారికి తగినంత చేయలేకపోయాననే బాధ తనకు ఉండేదని చెప్పారు. తాను సీఎం పగ్గాలు చేపట్టగానే వారికి ఎంతో చేయాలనే తపన కనబరిచానని ఆయన భావోద్వేగం కనబరిచారు. అమిత్‌షా ఆశీర్వాదం వల్లే తాను సీఎం అయ్యానని 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని 28 సీట్లలో గెలిపిస్తానని ఆయన చెప్పారు. సంఖ్యాబలం నిరూపించుకోవడంలో తాను విఫలమయ్యానంటూ రాజీనామాను ప్రకటించారు.

సీఎంగా ప్రజలకి సేవ చేయాలని అనుకున్నప్పటికీ తగినంత సంఖ్యాబలం లేనందున రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. బలపరీక్షకు వెళ్లకు ముందే ఆయన తన రాజీనామాను ప్రకటించడంతో ఇక బలపరీక్ష అవసరం లేకుండా పోయింది. కాగా, తన రాజీనామాను గవర్నర్‌కు వెంటనే సమర్పిస్తానని సభాముఖంగా తెలిపన యడ్యూరప్ప అక్కడి నుండి నేరుగా గవర్నర్ వాజూభాయ్ వద్దకు బయలుదేరారు. ఆయన రాజీనామా సమర్పించగానే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా జేడీఎస్-కాంగ్రెస్ కూటమిని గవర్నర్ ఆహ్వానించే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.