సీఎం గారి భార్య సినిమాలతో బిజీ

Karnataka CM Kumaraswamy Wife Re Entry in Movies

కర్ణాటకలో అనూహ్య పరిణామాల నేపథ్యంలో అతి తక్కువ సీట్లు వచ్చిన జేడీఎస్‌ అధినేత కుమార స్వామి కాంగ్రెస్‌ మద్దతుతో సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన విషయం తెల్సిందే. కన్నడ నాట కుమారస్వామి కొత్త రాజకీయానికి తెర లేపి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాడు. ఇక కుమార స్వామి భార్య రాధిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా పరిశ్రమలో నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించిన కుమారస్వామి కొన్నాళ్ల క్రితం హీరోయిన్‌ రాధికను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. కన్నడంతో పాటు తెలుగులో కూడా ఈమె హీరోయిన్‌గా నటించింది. కుమారస్వామిని పెళ్లి చేసుకుని, కూతురుకు జన్మనిచ్చిన రాధిక గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెల్సిందే. తాజాగా సీఎం గారి భార్య రాధిక సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.

Radhika KumaraSwamy

ఒకటి కాదు, రెండు కాదు ఒకేసారి అయిదు సినిమాల్లో రాధిక నటిస్తూ కన్నడ ప్రేక్షకుల ముందుకు వరుసగా తన సినిమాలను తీసుకు వచ్చేందుకు సిద్దం అవుతుంది. భర్త సీఎం అయినా కూడా నటనపై ఆసక్తితో రాధిక నటిగా కొనసాగుతుంది. తెలుగు, తమిళం, కన్నడంలో అర్జున్‌ హీరోగా జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘కాంట్రాక్ట్‌’ అనే చిత్రంలో రాధిక కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ చిత్రంతో పాటు ఇంకా ‘రాజేంద్ర పొప్పన్న’, ‘బైరా దేవి’, ‘నిమాగై’ చిత్రాల్లో కూడా రాధిక నటిస్తోంది. ఈ చిత్రాలు కాకుండా రాధిక వద్దకు పలు ప్రాజెక్ట్‌లు వస్తున్నాయి. రాధిక ప్రస్తుతం సీఎం భార్య అవ్వడంతో ఆమెతో వర్క్‌ చేసేందుకు నిర్మాతలు క్యూలు కడుతున్నారు. రాధికకు ఒక్కసారిగా నిర్మాతలు ఇలా వరుసగా ఆఫర్లు ఎందుకు ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సీఎం నుండి ఏదైనా సాయం పొందేందుకు కూడా అయ్యి ఉంటుందని కొందరు భావిస్తున్నారు.