భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న శ్రీలీల.. !

భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న శ్రీలీల.. !
Latest News

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే అతి తక్కువ కాలంలో తమకంటూ ఒక గుర్తింపు ని తెచ్చుకుంటారు. అలా ఒకటి రెండు సినిమాలతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హెరాయిన్ గా ఎదిగిపోయింది శ్రీ లీల. 

కర్ణాటక రాష్ట్రానికి చెందిన శ్రీ లీల… శ్రీకాంత్ కొడుకు నటించిన పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ మూవీ పెద్ద సక్సెస్ కాకపోయినా… రవితేజ నటించిన ధమాకా సినిమాతో ఇండస్ట్రీలోనే బిజీ హీరోయిన్ గా మారిపోయింది శ్రీ లీల. ధమాకా తర్వాత శ్రీ లీల కెరీర్ పూర్తిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు . ప్రస్తుతం హీరోయిన్ శ్రీ లీల చేతిలో ఏకంగా 10 సినిమాలు ఉన్నాయి.

భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న శ్రీలీల.. !
Sree Leela

ఇది ఇలా ఉండగా ప్రస్తుతం హీరోయిన్ శ్రీ లీల ఒక అరుదైన వ్యాధితో బాధపడుతోందని సమాచారం అందుతోంది. హీరోయిన్ శ్రీ లీలకు బాగా తుమ్మే వ్యాధి ఉందంట . ఒక్కసారి తుమ్మితే దాదాపు 15 సార్లు అలా వరుసగా తుమ్ములు వస్తూనే ఉంటాయంట . కెరీర్ ప్రారంభంలో ఈ సమస్య కారణంగా చాలా మూవీ లు కూడా కోల్పోవాల్సి వచ్చిందని తాజాగా శ్రీ లీల చెప్పినట్లు సమాచారం. అయితే ఇప్పటికి కూడా ఆ వ్యాధి అలాగే ఉందని… దానికి శ్రీ లీల ఎలాంటి చికిత్స తీసుకోవడం లేదని కూడా తెలుస్తుంది.