హరికృష్ణ పెద్ద కర్మ సందర్బంగా ఎన్టీఆర్‌తో బాబు, బాలయ్య

ChandraBabu And Balayya Meet to Jr NTR in Harikrishna Ceremony

నందమూరి ఫ్యామిలీలో పెను విశాదం మిగిల్చి 10 రోజుల క్రితం నల్లగొండ జిల్లాలో రోడ్డు యాక్సిడెంట్‌లో మృతి చెందిన హరికృష్ణ పెద్ద కర్మ నేడు హైదరాబాద్‌లోని జలవిహార్‌లో జరిగింది. నందమూరి కుటుంబ సభ్యులతో పాటు పెద్ద ఎత్తున సినీ మరియు రాజకీయ ప్రముఖులు హాజరు అయ్యారు. గత కొంత కాలంగా చంద్రబాబు నాయుడు మరియు బాలకృష్ణలు ఎన్టీఆర్‌తో కాస్త దూరంగా ఉంటున్న విషయం తెల్సిందే. పార్టీ వ్యవహరాల్లో కూడా ఎన్టీఆర్‌ను తల దూర్చకుండా, పార్టీలో ఎన్టీఆర్‌కు స్థానం లేకుండా చేస్తున్నారు అంటూ కూడా విమర్శలు వచ్చాయి. ఇటీవల హరికృష్ణ మరణంతో కుటుంబంలో వివాదాలు అన్ని కూడా సర్దుమణిగాయి. కుటుంబం మొత్తం కలిసి పోయిన వియం తెల్సిందే.

Jr ntr And Balayya And CBN

తాజాగా హరికృష్ణ పెద్ద కర్మ సందర్బంగా కూడా ఎన్టీఆర్‌ మరియు కళ్యాణ్‌ రామ్‌లతో చంద్రబాబు నాయుడు మరియు బాలకృష్ణలు చాలా సమయం మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఎన్టీఆర్‌తో చంద్రబాబు నాయుడు, బాలయ్యలు మాట్లాడటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కలయిక కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న నందమూరి అభిమానులు మరోసారి మురిసి పోయారు. కుటుంబంలో ఉన్న వివాదాలు అన్ని తొలగి పోయి ఎన్టీఆర్‌, బాలయ్య కలిసి పోవాలని, తెలుగు దేశం పార్టీ కోసం ఎన్టీఆర్‌ పని చేయాలి అంటూ అంతా కూడా కోరుకుంటున్నారు. మరి ఎన్టీఆర్‌ తదుపరి స్టెప్‌ ఏంటీ ఈ కలయిక ఈ విశాదం వరకేనా, ముందు ముందు కొనసాగుతుందా అనేది నందమూరి అభిమానుల్లో చర్చ జరుగుతుంది.