ముసుగేసుకుని కోర్టుకు హాజరైన నిర్మాత…!

Bandla Ganesh Will Commit Suicide If Congress Does Not Come To Power

టాలీవుడ్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పరిచయం అయ్యి, ఆ తర్వాత బ్లాక్‌ బస్టర్‌ నిర్మాతగా మారిపోయిన వ్యక్తి బండ్ల గణేష్‌. ఈయన నటుడిగా, నిర్మాతగా ప్రేక్షకులకు గుర్తుండి పోయాడు. కొన్ని సినిమాలే చేసినా కూడా బండ్ల గణేష్‌ నిర్మాతగా బ్లాక్‌ బస్టర్‌ గణేష్‌ అంటూ పేరు తెచ్చుకున్నాడు. నిర్మించే ప్రతి సినిమా కూడా బ్లాక్‌ బస్టర్‌ అవ్వాలనే కోరికతో తీస్తాడని, అందుకే ఆయన్ను బ్లాక్‌ బస్టర్‌ గణేష్‌ అంటారు అంటూ సినీ వర్గాల్లో టాక్‌ ఉంది. ఇక బండ్ల గణేష్‌ నిర్మాతగా వరుసగా నష్టాలు రావడంతో నిర్మాణంను వదిలేశాడు. తాజాగా ఈయన ఒక కేసు విచారణకు హాజరు అయ్యి మీడియాలో వార్త అయ్యాడు.

bandla-ganesh

కొన్నాళ్ల క్రితం పొద్దుటూరుకు చెందిన 65 మంది వద్ద అప్పుగా కొంత మొత్తంను తీసుకున్న బండ్ల గణేష్‌ వాటిని చెల్లించే క్రమంలో చల్లని చెక్కులు ఇచ్చాడు. దాంతో చెక్‌లు బౌన్‌ అవ్వడంతో ఇప్పుడు ఆయన కేసును ఎదుర్కొంటున్నాడు. చెక్‌ బౌన్స్‌ కేసులో కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాల్సిన పరిస్థితి రావడంతో మొహానికి ముసుగేసుకుని మరీ బండ్ల గణేష్‌ కోర్టుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ముఖంపై ముసుగును కోర్టు లోనికి వెళ్లే వరకు అలాగే ఉంచుకున్న బండ్ల గణేష్‌ మళ్లీ బయటకు రాగానే ముసుగును ధరించాడు. కారు ఎక్కి వెంటనే అక్కడ నుండి బండ్ల గణేష్‌ వెళ్లి పోయాడు. ఈయన కేసు మళ్లీ అక్టోబర్‌ 9కి వాయిదా వేయడం జరిగింది. ఆ రోజు కూడా బండ్ల గణేష్‌ రావాల్సి ఉంటుందని సమాచారం అందుతుంది.

bandla-ganesh-attend-the-co