అందుకే కుమారస్వామికి అస్వస్థత వచ్చిందా…?

Karnataka-CM-Skips-Tipu-Jay

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సెంటిమెంట్లు ఎక్కువగా పాటిస్తారని దాదాపు అందరికీ తెలుసు. ఆయన టిప్పు సుల్తాన్‌ జయంతి అంటేనే ఆమడ దూరం పారి పోతున్నారు. కన్నడ నాట నేడు టిప్పు సుల్తాన్‌ జయంతి ఉత్సవాలు జరగుతున్నాయి. అయితే కుమారస్వామితో పాటు ఆయన పార్టీ జేడీఎస్‌ ఈ వేడుకలకు దూరంగా ఉండబోతోందని నిన్న వార్తలు వచ్చాయి. ఎందుకంటే జేడీఎస్ పార్టీకి, పార్టీ అధినేత దేవెగౌడ కుటుంబానికి టిప్పు సుల్తాన్‌ జయంతి అంటే భయం. వేడుకల్లో పాల్గొంటే ఏదో చెడు జరుగుతుందని భావిస్తుంటారట. రాష్ట్రంలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమి అధికారంలో ఉన్నందున రాష్ట్రంలో టిప్పు సుల్తాన్‌ జయంతి వేడుకలకు జేడీఎస్‌ అయిష్టంగానే ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీనే ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్ర అసెంబ్లీలో, సెక్రటేరియట్‌లలో జరిగే అధికారిక కార్యక్రమాల ఆహ్వాన పత్రికలపైనా ముఖ్యమంత్రి పేరు ప్రచురించలేదు.

Tipu-Jayanti

కాంగ్రెస్‌కు చెందిన ఉప ముఖ్యమంత్రి డా.జి పరమేశ్వర ఈ వేడుకలకు హాజరుకానున్నారు. జేడీఎస్‌ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే టిప్పు సుల్తాన్‌ జయంతి వేడుకలకు దూరంగా ఉంటోంది. టిప్పు జయంతి వేడుకలకు వెళ్లే వారికి ఏదైనా చెడు జరుగుతుందని నమ్మే కొందరు పార్టీ మద్దతుదారులు అందుకు ఉదాహరణలు కూడా చెప్తున్నారు. నటుడు సంజయ్‌ ఖాన్‌ ‘ది స్వోర్డ్‌ ఆఫ్‌ టిప్పు సుల్తాన్’ అనే సినిమా షూటింగ్‌లో దాదాపు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందని, టిప్పు కత్తిని ఇంగ్లండ్‌ నుంచి వెనక్కి తెప్పించిన విజయ్‌ మాల్యా పారిపోయిన నేరస్థుడిగా లండన్‌లో ఉంటున్నాడని, టిప్పు జయంతి వేడుకలను ప్రారంభించిన మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారాన్ని కోల్పోయారని చెబుతున్నారు.

tipu-sultan
ఇలాంటి సెంటిమెంట్ లని దేవేగౌడ కుటుంబం బాగా నమ్ముతుంది. టిప్పు జయంతి వేడుకలు చేస్తే తమ కుటుంబానికి చెడు జరుగుతుందని భావిస్తుంది. అందుకే జేడీఎస్‌కు ఈ వేడుకలపై ఆసక్తి లేదు. కానీ కూటమి ప్రభుత్వం కారణంగా ఈ వేడుకలు జరపాల్సి వస్తోంది.’ అని గౌడ కుటుంబానికి సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జేడీఎస్‌ వేడుకలకు దూరంగా ఉండనుంది. దీనికోసం ఆయనకు అస్వస్థతకు గురయ్యారని. మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించారని ఈ నేపథ్యంలో, రేపు జరగనున్న టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలకు ఆయన దూరం కానున్నారని ఆ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అబ్దుకే ఇది కేవలం కాంగ్రెస్‌ కార్యక్రమంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భాజపా కూడా ఈ వేడుకలకు వ్యతిరేకం. శనివారం బ్లాక్‌డేగా నిర్వహించాలని భాజపా అంటోంది. అయితే కాంగ్రెస్‌లో కూడా కొందరికి ఈ వేడుకలపై ఆసక్తి లేదని సమాచారం.

kumara-swamy

గతంలో సిద్ధరామయ్య ఈ వేడుకలను ప్రారంభించి వివాదాలకు తెరలేపారని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రారంభించిన తర్వాత ఇప్పుడు ఉత్సవాలు నిర్వహించకపోతే ముస్లిం వ్యతిరేకులమనే భావన కలుగుతుందేమోనని కాంగ్రెస్‌ పార్టీ వేడుకలను కొనసాగిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ ఉత్సవాలను బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. మరోపక్క టిప్పు జయంతి ఉత్సవాలను ఏ ఒక్కరూ హర్షించడం లేదని మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప అన్నారు. ముస్లింలను సంతృప్తి పరిచేందుకే ఈ ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోందని ఆయన మండిపడ్డారు. జేడీఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని కొందరు నేతలు కూడా ఈ ఉత్సవాలను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ఉత్సవాలను నిర్వహించకూడదని డిమాండ్ చేస్తూ బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టాయి. ఈ నేపథ్యంలో కొడగు, హుబ్లీ, ధార్వాడ్ జిల్లాల్లో ఆదివారం ఉదయం వరకు 144 సెక్షన్ విధించారు.