కేసీఆర్ ముందరి కాళ్ళకు బంధం వేసిన దానం…!

Danam Nagender What Happened To Him

టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ కాంగ్రెస్ మార్క్ తెలివి తేటల్ని టీఆర్ఎస్ లో చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. బీసీలకు కాంగ్రెస్ లో అన్యాయం జరిగిందని టీఆర్ఎస్ లో అలా జరగదని పాపం కేసీఆర్ ముందరి కాళ్ళకి బంధం వేస్తున్నారు. ఎలా అంటే మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య నియోజకవర్గం జనగామను తెలంగాణ జనసమితికి కేటాయించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దీన్ని దానం తనకు అనుకూలంగా మల్చుకుని కొంత మంది ఇతర పార్టీల కార్యకర్తల్ని టీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు తన ఇంటి దగ్గరే ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ హైకమాండ్ పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు.

dhanam-kcr
కాంగ్రెస్ జాబితాలో బీసీలకు అన్యాయం జరిగిందని పొన్నాల ఉదంతాన్ని ఉదాహరించారు. ఖైరతాబాద్ టీఆర్ఎస్ టిక్కెట్ విషయంలో ఆయన కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు కనిపించారు కానీ ఎవరికి ఇచ్చినా గెలిపించుకుంటామని మరొకరికి ఇచ్చినా కలసి పని చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే తను టీఆర్ఎస్ లోకి చేరిన వెంటనే రెడ్ కార్పెట్ వేసి ఖైరతాబాద్ టిక్కెట్ ఇస్తారనుకున్న దానం నాగేందర్ కు కేసీఆర్ తొలి జాబితాలో షాక్ ఇచ్చారు. దానికి కారణం పీజేఆర్ కుమార్తె. దానంకు ఉన్న ఒకే ఒక్క ఊరట ఏమిటంటే అసలు అక్కడ అభ్యర్థిని ప్రకటించలేదు.

vijaya-reddy
గోషామహల్ కు వెళ్లాలని టీఆర్ఎస్ అధినేత చెప్పారని దానికి దానం అంగీకరించలేదని ప్రచారం జరిగిందని తెలుస్తోంది. ఇదే సమయమ్లో ఇప్పుడు దానం నాగేందర్ హఠాత్తుగా బీసీ నినాదాన్ని తీసుకు రావడానికి కారణం కాంగ్రెస్ ను ఇరుకున పెట్టడం కాదు టీఆర్ఎస్ హైకమాండ్ పై ఒత్తిడి పెంచడమే అని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుక్నతే ఇప్పుడు ఖైతరాబాద్ తరపున టిక్కెట్ కోసం పోటీ పడుతోంది పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి, గత ఎన్నికల్లో పోటీ చేసిన మన్నె గోవర్ధన్ రెడ్డి ఇద్దరూ రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే. టీఆర్ఎస్ అధినేత ఇప్పటికే ప్రకటించిన సీట్లలో రెడ్డి వర్గానికి సింహభాగం ప్రాధాన్యం లభించింది. వారిద్దర్నీ కాదని తనకు బీసీ కోటాలో అయినా ఖైరతాబాద్ టిక్కెట్ ఇవ్వాలని దానం.. ఇలా మీడియా ముందుకు వచ్చారు. అంటే ఒకరకంగా కేసీఆర్ ముందరి కాళ్ళకు బంధం వేసినట్టే !

I-Will-Support-Any-Candidat