విధేయ రాముడికి ‘రంగస్థలం’ సెంటిమెంట్‌…!

Vinaya Vidheya Rama Event In Vizag

రామ్‌ చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వినయ విధేయ రామ’ చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం గురించి ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. చరణ్‌ గత చిత్రం రంగస్థలం చిత్రం ఆడియోను వైజాగ్‌లో నిర్వహించారు. ఆ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రం విజయంతో రామ్‌ చరణ్‌ మరోసారి బాక్సాఫీస్‌ వద్ద తన స్టామినాను నిరూపించుకున్నాడు. అద్బుతమైన వసూళ్లను రాబట్టిన ఆ చిత్రం సక్సెస్‌ సెంటిమెంట్‌ను వినయ విధేయ రామ చిత్రానికి వర్కౌట్‌ చేసుకోవాలని చరణ్‌ భావిస్తున్నాడు.

ramcharan-boyapati

సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్‌ మూడవ లేదా నాల్గవ వారంలో వైజాగ్‌ లో వినయ విధేయ రామ చిత్రం ఆడియో వేడుకను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన మిగిలి ఉన్న రెండు పాటల చిత్రీకరణలో బోయపాటి మునిగి ఉన్నాడు. రెండు పాటలను కూడా భారీ ఎత్తున చిత్రీకరించేందుకు సెట్టింగ్‌లు వేస్తున్నారు. చరణ్‌కు జోడీగా ఈ చిత్రంలో కియారా అద్వానీ నటిస్తున్న విషయం తెల్సిందే. బోయపాటి మూవీ అంటే యాక్షన్‌ ఎక్కువగా ఉంటుంది. అదే తరహాలో ఈ చిత్రంలో కూడా యాక్షన్‌ ఉంటుందని తాజాగా విడుదలైన టీజర్‌ తో తేలిపోయింది. సంక్రాంతికి మెగా ప్యాన్స్‌కు ఈ చిత్రం పండగను తీసుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

vinaya-movie-ram-charan