“స్కంద” కి సెన్సేషనల్ రెస్పాన్స్.!

“స్కంద” కి సెన్సేషనల్ రెస్పాన్స్.!
Cinema News

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా శ్రీలీల మరియు సాయి మంజ్రేకర్ లు హీరోయిన్స్ గా మన టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన మాస్ యాక్షన్ డ్రామా “స్కంద”. మరి వీరి కాంబినేషన్ నుంచి వచ్చిన మొదటి సినిమా ఇది కాగా మంచి వసూళ్ళని కూడా ఈ చిత్రం రాబట్టింది. ఇక థియేట్రికల్ రిలీజ్ అనంతరం అయితే అంతా ఆసక్తిగా ఎదురు చూసిన ఓటిటి రిలీజ్ కూడా వచ్చేసింది.

“స్కంద” కి సెన్సేషనల్ రెస్పాన్స్.!
Skandha

పాన్ ఇండియా భాషల్లో డిస్నీ+ హాట్ స్టార్ లో ఈ సినిమా రాగ ఇప్పుడు ఈ సినిమాకి సెన్సేషనల్ రెస్పాన్స్ దక్కినట్టుగా తెలుస్తుంది. దీనితో హాట్ స్టార్ లో అయితే స్కంద చిత్రానికి ఏ టాలీవుడ్ సినిమాకి కూడా రాని భారీ రెస్పాన్స్ మొదటి 48 గంటల్లో క్లాక్ అయ్యినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే ఓటిటి లో కూడా మంచి రోరింగ్ రెస్పాన్స్ ని ఈ చిత్రం అందుకుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.