నేపాల్ భూకంపం.. 128కి చేరిన మృతుల సంఖ్య

National Politics: Huge Earthquake in Delhi.. 6.1 Earthquake
National Politics: Huge Earthquake in Delhi.. 6.1 Earthquake

నేపాల్​లో భూకంపం పెను విషాదం సృష్టిస్తోంది. నేపాల్ వాయువ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి 11 గంటల తర్వాత భూమి కంపించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 128కి చేరింది. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ విపత్తులో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల మధ్యే సహాయ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

నేపాల్​ ముఖ్యంగా రుకుమ్, జాజర్‌కోట్ జిల్లాలో భూకంప ప్రభావం తీవ్రంగా ఉందని.. అధికారులు ఈ రెండు జిల్లాల్లోనే 128 మంది మృతి చెందారని తెలిపారు. ఘటనాస్థలిని ప్రధాన మంత్రి పుష్పకమల్ దహల్ పరిశీలించారు. భూకంపం వల్ల జరిగిన ఆస్తి , ప్రాణ నష్టాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులను ఆదుకుంటామని భరోసానిచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విపత్తు సంభవించడం చాలా విచారకరమని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

నేపాల్​లోని భూకంప తీవ్రతకు భారత్​లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. దిల్లీ, ఉత్తర్​ప్రదేశ్​, బిహార్​లోని వివిధ ప్రాంతాల్లో భూమి కంపించడంతో స్థానికులు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.