నా మైండ్ లో ఉన్నది ఈ హీరో నే : సమంత

నా మైండ్ లో ఉన్నది ఈ హీరో నే : సమంత
Cinema News, Entertainment

ప్రస్తుతం సమంత రెస్ట్ మోడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. సినిమాలకు దూరంగా ఉంటూ కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకున్న ఈ హీరోయిన్.. ఇప్పుడు తన ఆరోగ్యం మీదే పూర్తి ఫోకస్ ని పెట్టింది. సంపూర్ణ ఆరోగ్యం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఎన్నో ప్రయోగాలను చేస్తోంది. ఇక తాను ఒప్పుకున్న మూవీ లను పూర్తిచేసుకుని మొత్తంగా తన ఆరోగ్యం పై ఫోకస్ పెట్టింది సమంత. అయితే. ‘మార్వెల్’ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ‘ది మార్వెల్స్’ అనే సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది .

నా మైండ్ లో ఉన్నది ఈ హీరో నే : సమంత
Samantha

ఈ సినిమా కి సంబంధించిన తెలుగు వెర్షన్ ప్రమోషన్స్ కి సమంత బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ఒక మీడియా సమావేశంలో పాల్గొన్న సమంత రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది . కాగా రిపోర్టర్ ‘తెలుగులో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లాగా ఒక సూపర్ హీరో సిరీస్ ను తీస్తే మీరు సూపర్ హీరోలుగా ఎవరిని ఎంచుకుంటారు….?’ అని అడగగా…. దానికి సమంత స్పందిస్తూ…. ‘ప్రస్తుతానికి నాకు అల్లు అర్జున్ అంటే పిచ్చి. అతనే నా సూపర్ హీరో. ఆయనతో పాటుగా విజయ్ దేవరకొండ కూడా’ అంటూ షాకింగ్ సమాధానం చెప్పింది . ప్రజెంట్ ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.