పెళ్లి అయ్యింది కాని, దాస్తున్నారా?

nayanathara and vignesh shivan got marriage

టాలీవుడ్‌ మరియు కోలీవుడ్‌ లో స్టార్‌ హీరోల సరసన నటించి స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ నయనతార ప్రస్తుతం కోలీవుడ్‌లో హీరోయిన్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తుంది. తెలుగులో ఈమద్య కాస్త తక్కువ సినిమాలు చేస్తున్నా కూడా తమిళంలో మాత్రం ఈమె చేస్తున్న చిత్రాలు బాక్సాపీస్‌ వద్ద భారీ వసూళ్లను సాధిస్తూనే ఉన్నాయి. ఇక ఈమె మొదట శింబుతో ఆ తర్వాత ప్రభుదేవాతో ప్రేమాయణం సాగించింది. ఆ ప్రేమలు విఫలం అవ్వడంతో కొంత కాలం ఒంటరి జీవితాన్ని గడిపిన నయన్‌ ప్రస్తుతం విఘ్నేష్‌ శివన్‌తో ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెల్సిందే. వీరిద్దరు ఈమద్య కాలంలో ఎక్కడ పడితే అక్కడ తెగ సందడి చేస్తూ ఉన్నారు. సోషల్‌ మీడియాలో వీరిద్దరి గురించి పెద్ద చర్చ జరుగుతుంది.

పెళ్లి అయ్యింది కాని, దాస్తున్నారా? - Telugu Bullet

కోలీవుడ్‌లో వినిపిస్తున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం నయనతార, విఘ్నేష్‌ శివన్‌లు కొన్ని నెలల క్రితమే వివాహం చేసుకున్నారట. కాని ఆ విషయాన్ని మాత్రం బయటకు చెప్పడం లేదు. హీరోయిన్స్‌ పెళ్లి విషయాన్ని బయటకు తీసుకు వస్తే ఖచ్చితంగా ఆఫర్లు తగ్గుతాయి. అందుకే నయనతార కూడా తన పెళ్లి విషయాన్ని దాస్తున్నట్లుగా తెలుస్తోంది. పెళ్లి అయిన వారి మాదిరిగానే విదేశాల్లో టూర్‌ు పండుగలు జరుపుకోవడం చేస్తున్నారు. అందుకే తమిళ మీడియాలో ఇలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ విషయం గురించి కొందరు లోతుగా అద్యాయనం చేస్తే అసలు విషయం తెలుస్తుందట. త్వరలోనే నయన్‌ అధికారికంగా తన పెళ్లి విషయాన్ని మీడియాకు చెప్పే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.