థియేటర్లలో తుఫాను సృష్టిస్తున్న జవాన్

థియేటర్లలో తుఫాను సృష్టిస్తున్న జవాన్
Jawan

షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘జవాన్’ ఎట్టకేలకు థియేటర్లలోకి రావడంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. ‘జవాన్’ విడుదలను పండుగలా జరుపుకుంటున్న అభిమానులు ‘జవాన్’ మార్నింగ్ షోలను హౌస్‌ఫుల్ చేశారు.

సినిమా విడుదల సందర్భంగా అభిమానులు గుమిగూడిన సమయంలో థియేటర్ల వెలుపలి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అట్లీ, నయనతార, విజయ్ సేతుపతి అభిమానులు కూడా ‘జవాన్’ సినిమాని జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. ‘జవాన్’ పోస్టర్లు పట్టుకుని అభిమానులు థియేటర్ల వెలుపల డ్యాన్స్ చేయడం చూడవచ్చు.

‘జవాన్’ గురించి షారుక్ ఖాన్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, “‘జవాన్’ అనేది భాషలు మరియు భౌగోళికాలను దాటి అందరూ ఆనందించే యూనివర్సల్ కథ. ఈ ప్రత్యేకమైన చిత్రాన్ని రూపొందించినందుకు క్రెడిట్ అట్లీకి చెందుతుంది, నేను యాక్షన్ చిత్రాలను ఇష్టపడుతున్నాను కాబట్టి ఇది నాకు అద్భుతమైన అనుభవాన్ని కూడా అందించింది! అని చెప్పారు.

‘జవాన్’లో దీపికా పదుకొణె కూడా ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. సన్యా మల్హోత్రా, ప్రియమణి, యోగి బాబు, రిధి డోగ్రా, గిరిజా ఓక్, సంజీతా భట్టాచార్య, లెహర్ ఖాన్, ఆలియా ఖురేషి మరియు సునీల్ గ్రోవర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.