ఇప్పుడు ఏపీలో కూడా “కల్కి 2898ఎడి” రికార్డు బిజినెస్?

Now "Kalki 2898AD" record business in AP too?
Now "Kalki 2898AD" record business in AP too?

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకోణ్ అలాగే దిశా పటాని సహా యూనివర్సల్ హీరో కమల్ హాసన్, అమితాబ్ లాంటి దిగ్గజ స్టార్లు నటిస్తున్న సెన్సేషనల్ మూవీ “కల్కి 2898ఎడి” (Prabhas Kalki 2898AD). దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ మూవీ ఇది కాగా ఈ మూవీ కోసం ప్రపంచమే ఎదురు చూస్తుంది.

అయితే ఈ మూవీ తాలూకా బిజినెస్ సంబంధించి ఒక రేంజ్ లో జరుగుతున్నట్టుగా వినిపిస్తుంది. ఆల్రెడీ జస్ట్ ఓటిటి హక్కులే 300 కోట్లకి పైగా వచ్చేయగా థియేట్రికల్ బిజినెస్ కూడా ఒక రేంజ్ లో ఉంటుంది అని వినిపిస్తుంది. ఆల్రెడీ నైజాంలోనే 100 కోట్లకి పైగా ఆఫర్ ని ఈ మూవీ అందుకున్నట్టుగా టాక్ ఉంది.

Now "Kalki 2898AD" record business in AP too?
Now “Kalki 2898AD” record business in AP too?

ఇప్పుడు తాజాగా ఏపీలో కూడా రికార్డు బిజినెస్ ని ఈ మూవీ లాక్ చేసినట్టుగా వినిపిస్తుంది. మరి లేటెస్ట్ బజ్ ప్రకారం ఏపీ మొత్తంగా కూడా 100 కోట్లకి పైగా బిజినెస్ ని ఈ మూవీ జరుపుకున్నట్టుగా వినిపిస్తుంది. దీనితో కేవలం ఏపీ, తెలంగాణలోనే ఏకంగా 200 కోట్లకి పైగా బిజినెస్ ని జరుపుకుంది అని చెప్పుకోవాలి . ఇక ముందు ముందు ఈ మూవీ ఏ రేంజ్ బిజినెస్ ని జరుపుతుందో చూడాలి.