అప్పుడే 150 కోట్లు.. వివాదం కలిసొచ్చిందా…?

Director Murugadoss Sarkar Movie Controversy

తమిళ సినిమాలు ఈమద్య కాలంలో భారీగా వసూళ్లు రాబడుతున్నాయి. ముఖ్యంగా విజయ్‌ నటించిన సినిమాల లెక్కలు వందల కోట్లలోనే ఉంటున్నాయి. పెద్ద ఎత్తున వసూళ్లు దక్కించుకుంటున్న విజయ్‌ సినిమాల జాబితాలో మరోసినిమా చేరింది. తాజాగా విడుదలైన సర్కార్‌ చిత్రం రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే. మొదటి రెండు రోజుల్లోనే ఈ చిత్రం వంద కోట్లను చేరుకోగా శని, ఆదివారాల్లో సినిమా 200 కోట్లకు చేరుతుందని చిత్ర యూనిట్‌ సభ్యులు ఆశించారు. వారు ఆశించినట్లుగానే ఆది వారం చివరి షో ముగిసే సమయానికి సర్కార్‌ చిత్రం 200 కోట్ల క్లబ్‌ లో చేరే అవకాశం ఉందని తమిళ ట్రేడ్‌ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు.

sarkar-movie

శుక్రవారం ముగిసేప్పటికి సినిమా 150 కోట్ల మార్క్‌ను చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు మూడు వేల స్క్రీన్‌లలో విడుదలైన ఈ చిత్రం రికార్డు స్థాయి ఓపెనింగ్‌ను దక్కించుకుంది. ఈ చిత్రానికి పోటీగా విడుదలైన చిత్రాలు పెద్దగా ప్రభావం చూపించలేక పోతున్నాయి. దాంతో ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లు దక్కించుకుంటుంది. మరో రెండు రోజుల్లో ఈ చిత్రం రెండు వందల కోట్ల క్లబ్‌ లో చేరే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు. వివాదాస్పద అంశంను ఈ చిత్రంలో చేర్చడం వల్ల ఈ చిత్రం భారీ వసూళ్లను దక్కించుకుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వివాదం వల్ల కూడా ఈ చిత్రంకు ఇంత భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయనే అభిప్రాయం. ఒక వైపు హెడ్‌డీ ప్రింట్‌ తో పైరసీ కూడా అయ్యింది. అయినా కూడా సినిమా మంచి వసూళ్లను రాబడుతూనే ఉంది.

sarkar-movie