సీ-ఓటర్‌ సర్వే : తెలంగాణలో కూటమిదే అధికారం…?

C Voter Survey Telangana

ఇండియా టుడే – పొలిటికల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (PSE) సర్వే తెలంగాణలో టీఆర్ఎస్ గెలుస్తుందని వెల్లడిస్తే సీ-ఓటర్ సర్వే మాత్రం ఇందుకు భిన్నమైన అంచనాలు వెల్లడించింది. సెంటర్‌ ఫర్‌ ఓటింగ్‌ ఒపీనియన్స్‌ అండ్‌ ట్రెండ్స్‌ (సి-ఓటర్) సంస్థ ఏబీపీ న్యూస్‌, రిపబ్లిక్‌ టీవీ కోసం ఈ సర్వే నిర్వహించింది. తెలంగాణలో మహాకూటమి విజయం తథ్యమని ప్రకటించి సంచలనం రేపింది. కూటమికి 64 సీట్లతో స్పష్టమైన మెజారిటీ వస్తుందని, కానీ తెరాసకు మాత్రం 42 సీట్లు మాత్రమే వస్తాయని ప్రకటించింది. తెలంగాణలో మహాకూటమిగా ఏర్పడిన కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలకు 33.9 శాతం ఓట్లతో 64 సీట్లు, 29.4 శాతం ఓట్లతో టీఆర్ఎస్ 42 సీట్లలో గెలుపొందుతాయని సీ-ఓటర్ సర్వే అంచనా వేసింది. బీజేపీకి 4, ఇతరులకు 9 సీట్లు చొప్పున లభిస్తాయని పేర్కొంది. అయితే, కేసీఆర్‌ సీఎంగా ఉండాలని 42.90 శాతం మంది కోరుకుంటున్నారని, జానారెడ్డి సీఎంగా ఉండాలని 22.60 శాతం మంది కోరుకుంటున్నారని వివరించింది.

kcr

 

సీఎం ఎవరని తేల్చుకోలేనివారు, ఇతరుల పేర్లు సూచించినవారి సంఖ్య 27.30 శాతం ఉందన్నారు. ఈ ఏడాది ఎన్నికలు జరుపుకోనున్న ఐదు రాష్ట్రాల్లో మొత్తం 67,848 మంది అభిప్రాయాలు సేకరించారు. తెలంగాణలో 13,624 మంది, రాజస్థాన్‌లో 13,377 మంది, మధ్యప్రదేశ్‌లో 25,745 మంది, ఛత్తీస్‌గఢ్‌లో 13,911 మంది, మిజోరంలో 1191 మంది నుంచి తీసుకున్న అభిప్రాయాల ప్రకారం ఈ అంచనాలు రూపొందించారు. ఇక రాజస్థాన్‌‌లో : రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రానుందని సీ-ఓటర్ సర్వే స్పష్టం చేసింది. ఇక్కడ కాంగ్రెస్‌కు 47.9 శాతం ఓట్లతో 145 సీట్లు లభిస్తాయని, బీజేపీకి 39.7 శాతం ఓట్లతో 45 సీట్లు మాత్రమే దక్కుతాయని తెలిపింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా సచిన్‌ పైలట్‌ 38.7% శాతం మంది మొగ్గు చూపారు. ప్రస్తుత సీఎం వసుంధర రాజే 22.7 శాతం, అశోక్‌ గెహ్లాట్‌‌కు 20.5 శాతం ఓట్లు లభించాయి.మధ్యప్రదేశ్‌‌లో : మధ్యప్రదేశ్‌‌లో కూడా బీజేపీకి పరాజయం తప్పదని తెలుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్‌కు 42.3 శాతం ఓట్లతో 116 సీట్లు దక్కుతాయని, బీజేపీకి 41.5 శాతం ఓట్లతో 107 సీట్లు లభిస్తాయని పేర్కొంది. జ్యోతిరాదిత్య సింధియా సీఎం కావాలని 41.6% కోరుకుంటున్నారు.

vote

శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎంగా ఉండాలని 37.4% శాతం మంది కోరుకుంటున్నట్లు సర్వే పేర్కొంది.ఛత్తీస్‌గఢ్‌‌లో : ఛత్తీస్‌గఢ్‌‌లో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ తప్పదని తెలుస్తోంది. 42.2 శాతం ఓట్లతో కాంగ్రెస్‌కు 41 సీట్లు, 41.6 శాత ఓట్లతో బీజేపీకి 43 సీట్లు లభిస్తాయని, ఇతరులకు 16.2 శాతం ఓట్లతో 6 సీట్లు దక్కుతాయని పేర్కొంది. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఇతరులు కీలక పాత్ర పోషించే అవకాశాలు లేదని అంచనా వేసింది. రమణ్‌సింగ్‌ ముఖ్యమంత్రి కావాలని 56.34% మంది కోరుకుంటున్నారని, అజిత్‌ జోగి సీఎం కావాలని 43.66% శాతం కోరుతున్నారని సర్వే వెల్లడించింది.మిజోరంలో : మిజోరంలో కాంగ్రెస్‌కు పరాభావం తప్పేలా లేదని స్పష్టమవుతోంది. కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బీజేపీ మద్దతు పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్‌కు 17 సీట్లు, కాంగ్రెస్‌కు 12, జేపీఎంకు 9 సీట్లు లభించనున్నాయని తెలిపింది. ఐదుసార్లు సీఎంగా సేవలందించిన తన్హావాలాకు ఇంకా ఆధరణ తగ్గనట్లు తెలుస్తోంది. ఆయన సీఎంగా ఉండాలని 27.3 శాతం కోరుకుంటున్నారు. ఎంఎన్ఎఫ్‌ నేత జోరాథాంగాకు 25.4 శాతం మంది మొగ్గుచూపారు.

CM-AND-RAHUL-GANDHI