విజయ్ + అట్లీ – ముచ్చటగా మూడోసారి…!

Vijay Next Movie With Mersel Director Atlee

అట్లీ అనే దర్శకుడి పేరు తమిళ హీరో విజయ్ నటించిన అదిరింది (తమిళంలో మెర్సల్) తో మరింత వెలుగులోకి వచ్చింది గానీ, ఈ తమిళ దర్శకుడి గురించి సినీప్రియులకు అట్లీ మొదటి సినిమా ‘రాజా-రాణి’ తోనే తెలిసింది. ఆ తరువాత ఈ దర్శకుడు దళపతి అని ముద్దుగా పిలువబడే విజయ్ తో పోలీస్ (తమిళం లో తెరి ) అనే సినిమా ని రూపొందించాడు. ఈ సినిమా తమిళంలో విజయవంతమైన, తెలుగు లో మాత్రం అంతగా ఆడలేదు. తరువాత విజయ్ తో అట్లీ తీసిన అదిరింది (తమిళం లో మెర్సల్) సినిమా కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాకి బాహుబలి కథా రచయిత విజయేంద్రప్రసాద్ కథని అందించడం విశేషం.

Atlee-vijay-rehaman

ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అట్లీ తన ఫేవరెట్ హీరోగా చెప్పుకునే విజయ్ తో మూడో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి కూడా ఏ. ఆర్. రెహ్మాన్ సంగీతం అందిస్తుండగా, ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఈ సినిమా యొక్క పూజ కార్యక్రమం నిన్న జరుగగా, త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టి, వచ్చే దీపావళి కి విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. విజయ్ నటించిన తాజా చిత్రం సర్కార్ ఇటీవలే విడుదలై తెలుగులో మంచి విజయం సాధించగా, తమిళంలో మాత్రం ఘనవిజయం సాధించింది. ఈ సినిమా తరువాత విజయ్ నటించబోయే చిత్రం అట్లీ తో చేస్తున్నదే కావడం విశేషం. మరీ, ఈసారి ఈ కుర్ర డైరెక్టర్ ఎటువంటి కథని సిద్ధం చేసుకున్నాడో తెలుసుకోవడానికి మరికొంత సమయం వేచిచూడాలసిందే.

Vijay-Next-Movie